త్వరలో ఆ హీరోయిన్ మరణిస్తుంది: వేణుస్వామి
వేణుస్వామి... ప్రస్తుతం ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ రంగంలో, రాజకీయ రంగంలో సెలబ్రిటీల గురించి, వారి జాతకాల గురించి చెబుతూ ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయిపోయారు. జాతకంలో ఉన్న దోషాలను గుర్తించి ప్రత్యేకంగా ఆయనచేత పూజలు చేయించుకున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారింది. నిధి అగర్వాల్ కూడా తాజాగా ప్రభాస్ సినిమాలో ఆఫర్ దక్కించుకుంది. ఖిలాడీ, రామబాణం సినిమాల కథానాయిక డింపుల్ హయతి ఇటీవలే వేణుస్వామిచేత పూజలు చేయించుకున్నారు.
వీటన్నింటికన్నా సమంత, నాగచైతన్య వివాహం జరిగిన తర్వాత వారిద్దరూ ఎక్కువరోజులు కలిసివుండరు.. విడిపోతారని వేణుస్వామి చెప్పారు. అయితే అప్పుడెవరూ ఆయన మాటలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎప్పుడైతే వీరిద్దరూ విడిపోయారో అప్పటి నుంచి వేణుస్వామికి డిమాండ్ పెరిగింది. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో 40 సంవత్సరాల్లోపు వయసుండే హీరోయిన్ మరణిస్తారని చెప్పారు.

వేణుస్వామి చెప్పిన ఆ హీరోయిన్ ఎవరా? అంటూ ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోరకంగా వేర్వేరు హీరోయిన్ల పేర్లు చెబుతున్నప్పటికీ కొందరికి మాత్రం సమంత గురించి ఆందోళన పట్టుకుంది. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత అమెరికాలో చికిత్స తీసుకోవడానికి వెళ్లి వచ్చింది. మయోసైటిస్ ముదిరితే ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయం గుర్తుచేస్తూ సమంత అభిమానులు భయాందోళనలకు లోనవుతున్నారు. వేణుస్వామి చెప్పింది చెప్పినట్లు జరుగుతున్నాయని, ఆయన హీరోయిన్ అని చెప్పింది సమంత గురించేనని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications