వేణుస్వామి అసలు జాతకం... కాశ్మీర్ లో దొరికాడు!

రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు చెప్పే వేణుస్వామి గురించి తెలియనివారు ఉండరు అని చెప్పొచ్చు. రాజకీయ రంగంలోని సెలబ్రిటీలకు, సినీ రంగంలోని సెలబ్రిటీలకు వ్యక్తిగత జాతకాలు చెబుతూ, వారిచేత పూజలు చేయిస్తూ చివరకు తాను కూడా ఓ సెలబ్రిటీ అయిపోయాడు. వాస్తవానికి ఈయన చెప్పిన వాటిల్లో ఎన్ని జరుగుతున్నాయో, ఎన్ని జరగడంలేదో ఆయనకే తెలియాలి. కాకపోతే నాగచైతన్య-సమంత విడిపోతారని వేణుస్వామి ముందే చెప్పాడు. అది నిజం కావడంతో అప్పటి నుంచి ఈయన గతంలో ఎవరి గురించి చెప్పారు? ఎవరెవరి గురించి జాతక చక్రం పరిశీలించారు? లాంటి విషయాలన్నీ నెటిజన్లు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఆయన చెప్పే వాటిల్లో రెండు జరిగితే 98 జరగవు. కానీ ఆ రెండింటిద్వారా పాపులారిటీ తెచ్చుకోవడంలో మాత్రం వేణుస్వామి దిట్ట.

తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేణుస్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వేణు స్వామి జమ్మూ కాశ్మీర్ వెకేషన్ కు వెళ్లాడు. అక్కడ వెహికిల్ మీద చక్కర్లు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరలవుతోంది. వీడియోలో ఆయన కాస్త మోడ్రన్ గా కనిపిస్తున్నాడు. కళ్లద్దాలు పెట్టుకొని స్టైల్ గా దర్శనమిచ్చాడు. జాతకాలు చెబుతూ సైలెంట్ గా ఉంటాడనుకున్నాంకానీ మోడ్రన్ స్టైల్ లో స్టెప్పులేస్తున్నాడే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఆయన మనిషి కాదా.. ఆయనకు కోరికలుండవా? అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

astrologer venu swamy trekking in jammu kashmir

రష్మికచేత పూజలు చేయించాడు వేణుస్వామి. ఆ తర్వాత ఆమె నేషనల్ క్రష్ అయింది. నిధి అగర్వాల్, డింపుల్ హయతి, మరికొందరితో కూడా పూజలు చేయించారు. వారంతా టాప్ ప్లేస్ లో ఉన్నారా? అంటే చెప్పలేని స్థితి. ఒక్క నిధి అగర్వాల్ మాత్రం హరిహర వీరమల్లుతోపాటు ప్రభాస్ సినిమాలో ఆఫర్లు సంపాదించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+