ప్రభాస్ పై మరోసారి వేణుస్వామి కామెంట్స్.. ఆధారాలతో సహా!!

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి ప్రభాస్ పై పడ్డారు. ఆయన జాతకం బాగోలేదంటూ నిత్యం చెబుతూ వార్తల్లో నిలిచిన వేణుస్వామి మరోసారి అదే ప్రయత్నం చేశారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ పై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాక ఆధారాలు కూడా చూపించి తాను చెప్పింది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తన పాత వీడియోలు స్పష్టంగా పరిశీలించాలని, ఆదిపురుష్ సినిమా ఫ్లాపవుతుందని ముందే చెప్పానని, ఆ సినిమా ఫ్లాపైందా? లేదా? అని వీడియోలో ప్రశ్నించారు.

సలార్ సినిమాను ప్రభాస్ అభిమానులు తప్ప ఎవరూ చూడరని చెప్పానని, అదే జరిగిందా? లేదా? అన్నారు. ప్రభాస్ సినిమాల విషయంలో తాను చెప్పినట్లే జరిగిందని, మనదేశంలోనే నాలాంటి మగాడు లేడని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని ప్రభాస్ జాతకం అస్సలు బాగోలేదంటూ సంలచన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు.

astrologer venuswamy comments on actor prabhas

గతంలో కూడా ఇలాగే చెప్పాడని, అసలు ప్రభాస్ వ్యక్తిగత జాతకం వేణుస్వామికి ఎవరిచ్చారని, ఈసారి కనపడితే మాములుగా ఉండదని, బయట కనపడకుండా బతుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ జాతకాన్ని ఆధారంగా చేసుకొని ఒక సెలబ్రిటీ అయిపోదామనే ఆలోచనలో వేణుస్వామి ఉన్నాడని, తమ డార్లింగ్ కు సంబంధించి నెగెటివ్ విషయాలు చెప్పినంత మాత్రాన ఎవరూ ఫేమస్ కారని, విషయం ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే మరికొందరు మాత్రం వేణుస్వామి చెప్పిందే సరిగా ఉందేమోకదా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాహో, రాధేశ్యామ్ లాంటి సినిమాలన్నీ ఫ్లాపయ్యాయని, ఆయన చెప్పినట్లుగానే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రభాస్ ను చూస్తే అర్థమవుతోందని, ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న డార్లింగ్ చేతి నొప్పితో బాధపడే ఫొటోలు వైరల్ అయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+