Actor Ali: చిక్కుల్లో సినీ నటుడు అలీ.. నోటీసులు ఇచ్చిన అధికారులు..!

సినీ నటుడు అలీ చిక్కుల్లో పడ్డారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఆయనకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం ఎక్మామిడి గ్రామంలో అలీ భూమి కొనుగోలు చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫామ్ హౌస్ ను అనుమంతి లేకుండా నిర్మించారని అధికారులు గుర్తించారు. ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గ్రామ పంచాయతీ అధికారులు తనిఖీ చేసి నిర్దారించారు. దీంతో అనుమతి లేకుండా నిర్మాణాలు ఎలా చేపట్టారని ఎక్మామిడి గ్రామ కార్యదర్శి శోభారాణి అలీకిని నోటీసులు ఇచ్చారు.

కొద్ది సంవత్సరాల క్రితం అలీ ఎక్మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో కొన్ని ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేశారు. ఆ భూమిలో అలీ వ్యవసాయం చేస్తున్నారు. స్థానిక కూలీల సహాయంతో వ్యవసాయ భూమిలో పంటలు, పండ్ల తోటలు వేశారు. ఈ క్రమంలోనే అక్కడి వెళ్తే ఉండడం కోసం ఫామ్ హౌస్ నిర్మించుకోవాలని నిర్ణయించి నిర్మాణం మొదలు పెట్టారు. ఫామ్ హౌస్ నిర్మాణం పూర్తయింది. అయితే ఆ ఫామ్ హౌస్.. ఫామ్ హౌస్ నిర్మాణాలు అక్రమంగా నిర్మించారని ఆరోపణలు వచ్చాయి.

Authorities serve notices to film actor Ali for issuing notices without permission

గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇష్టానుసారం అలీ తన ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆరోపించారు. దీంతో అధికారులు తనిఖీలు చేసినట్లు తెలిసింది. అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టినట్లు తేలడంతో అధికారులు అలీకి నోటీసులు జారీ చేసారు. దీనిపై అలాంటి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. కాగా చాలా మంది సినీ హీరోలు, నటులకు హైదరాబాద్ శివారుల్లో ఫామ్ హౌస్ లు ఉన్నాయి. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అప్పట్లో అలీ వీడియో విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+