'బాహుబలి: ది ఎపిక్' రివ్యూ.. ఇలాంటి సీన్లు ఎలా డిలీట్ చేశావ్ జక్కన్న

భారతీయ సినీ చరిత్రలో 'పాన్-ఇండియా' అనే పదానికి అర్థం చెప్పి, సినిమా వ్యాపార రూపురేఖలను మార్చేసిన సంచలన సృష్టి 'బాహుబలి'. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యం, పదేళ్ల క్రితం (మొదటి భాగం 'ది బిగినింగ్') ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అపారమైన వ్యయంతో, అద్భుతమైన కల్పనా శక్తితో రాజమౌళి నిర్మించిన మాహిష్మతి రాజ్యం కేవలం ఒక కల్పన కాదు, అది ఒక అనుభూతి.

'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే ఉత్కంఠభరితమైన ప్రశ్నకు సమాధానంగా వచ్చిన 'ది కన్‌క్లూజన్‌' సైతం ప్రపంచవ్యాప్తంగా విజయ ఢంకా మోగించింది. ఇప్పుడు, ఆ రెండు భాగాలను కలిపి, సినిమా చరిత్రలో మరో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతూ... 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Baahubali The Epic Review

పాత కథ... కొత్త అనుభూతి
'బాహుబలి' కథ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ, ఈ 'ఎపిక్' వెర్షన్ ప్రేక్షకులకు ఓ కొత్త సినిమా చూసిన అనుభూతిని పంచుతుంది. భారీ తెరపై మాహిష్మతి ప్రపంచాన్ని మరోసారి చూసే అవకాశం, అందులోని శక్తివంతమైన పాత్రల ప్రయాణాన్ని ఒకేసారి ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

రాజమౌళి తెలివిగా రెండు భాగాలను ఒకే ఫార్మాట్‌లోకి కుదించారు. ప్రథమార్థంలో తొలి సినిమాను, ద్వితీయార్థంలో రెండో సినిమాను చూపించినప్పటికీ, దాదాపు తొంభై నిమిషాలకు పైగా సన్నివేశాలకు కోత విధించారు. ముఖ్యంగా, తొలి భాగంలోని శివుడు-అవంతిక లవ్ ట్రాక్, 'పచ్చబొట్టేసినా' పాట ఎపిసోడ్‌లను కేవలం రాజమౌళి వాయిస్ ఓవర్‌తో పూర్తి చేయడం, యుద్ధ సన్నివేశాలను కుదించడం వంటి మార్పులు కథనాన్ని మరింత వేగంగా, పదునుగా మార్చాయి.

భావోద్వేగాల మేజిక్
ఈ కొత్త ఎడిటింగ్ వెర్షన్‌లో, సినిమాటిక్ థ్రిల్ ఒకవైపు, భావోద్వేగాల గాఢత మరోవైపు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. కథానాయికగా ప్రభాస్ రాయల్ లుక్, డైనమిక్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు పండగ. భళ్లాలదేవగా రానా, శివగామిగా రమ్యకృష్ణ, దేవసేనగా అనుష్క, కట్టప్పగా సత్యరాజ్ నటన మరోసారి మైమరిపిస్తుంది.

కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఈ 'ఎపిక్' వెర్షన్‌కు కొత్త హంగులను అద్దింది. మారిన సాంకేతికతకు అనుగుణంగా విజువల్స్ మరియు సంగీతంలో చేసిన రీవర్క్, సినిమా క్వాలిటీని మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ విజువల్ ఎఫెక్ట్స్ , యాక్షన్ కొరియోగ్రఫీ నాణ్యత, భారతీయ సినిమాకు ఒక మచ్చుతునకగా నిలిచాయి.

ముగింపు కాదు... ఇది ఒక కొత్త ప్రారంభం
'బాహుబలి: ది ఎపిక్' కేవలం సినిమా రిలీజ్ కాదు, ఇది ఒక కొత్త ట్రెండ్‌ను సూచిస్తోంది. రెండు హిట్ భాగాలను కలిపి ఒకేసారి అందించే ఈ కొత్త ప్రయోగం సినీ పరిశ్రమకు మరో దారి చూపింది. అంతేకాకుండా, బాహుబలి ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదని చాటి చెబుతూ, ఇదే పాత్రలతో 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' అనే యానిమేషన్ సినిమా ప్రచార చిత్రాన్ని కూడా ఈ సినిమాలో ప్రదర్శించారు. ప్రపంచ యానిమేషన్ మార్కెట్‌పై భారతీయ సినిమా సత్తా చాటడానికి చేస్తున్న ఈ ప్రయత్నం భవిష్యత్తులో ఇంకెన్ని సంచలనాలకు నాంది పలుకుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+