పేరుకే "బ్యాడ్ గాళ్స్" కానీ.. మూవీ రివ్యూ & రేటింగ్ ???

క్రిస్మస్ టార్గెట్ గా ఒకేసారి పలు సినిమాలు థియేటర్లకు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు) మూవీ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ కూడా ఆడియన్స్ ని అలరించేందుకు వచ్చేసింది. అమ్మాయిల ట్రిప్, క్రైమ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ మిక్స్ చేసి మూవీని రూపొందించారు. ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేటి యువతను ఆకర్షించేట్టుగా మలిచి సక్సెస్ అయ్యారా ? ఈ మూవీ కథ, కథనం ఎలా ఉంది? అన్నది మీకోసం ప్రత్యేకంగా..

కథ..

ఈ చిత్రం హైదరాబాద్‌లో హాస్టల్ జీవితాన్ని పంచుకునే నలుగురు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. రోజీ రెడ్డి, మల్లీశ్వరి, మెర్సీ, వెంకట్ లక్ష్మి అనే కారెక్టర్స్ ప్రధానంగా కనిపిస్తాయి. అందులో ఇద్దరికీ జాన్, నాయుడు అనే వ్యక్తులతో నిశ్చితార్థం జరుగుతుంది. అయితే పెళ్లికి ముందు అలా ఓ సారి చివరగా ట్రిప్ వేయాలని, హాయిగా, ఆనందంగా గడపాలని స్నేహ బృందం అనుకుంటుంది. ఈ క్రమంలో వారి అక్క స్రవంతి సహాయంతో మలేషియాకు ఒక స్పిన్ స్టర్ ట్రిప్‌‌ను ప్లాన్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఒక పేరుమోసిన నేరస్థుడు అనకొండ అనేవాడు అదే సమయంలో మలేషియాలో బాంబు దాడిని ప్లాన్ చేస్తాడు. అంతే కాకుండా ఈ నలుగుర్ని కిడ్నాప్ చేయాలని ఉమెన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కూడా రెడీ అవుతుంది. మరి వారి సరదా ప్రయాణం చివరకు ఎలా ముగిసింది? ఈ క్రమంలో ఆ అమ్మాయి ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడతారు? అన్నదే అనేది మిగిలిన కథ.

bad-girls-movie-review-and-rating-in-telugu

నటీనటుల పనితీరు..

నలుగురు ప్రధాన పాత్రలు - అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్న ఎంతో ఎనర్జీగా కనిపించారు. వారి వారి పాత్రల తీరుకు తగ్గట్టుగా తెరపై అద్భుతంగా నటించారు. నలుగురి మధ్య మంచి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని చూపెట్టారు. మోయిన్, రోహన్ సూర్య పాత్రలు కూడా బాగుంటాయి. ఈ రెండు పాత్రలతో కావాల్సినంత వినోదాన్ని ప్రేక్షకులకు అందించారు. అలా మిగిలిన వారిలో రేణు దేశాయ్ బలమైన పాత్రలో, మలేషియా పోలీసుగా రాజా రవీంద్ర, రెండు సన్నివేశాలలో తాగుబోతు రమేష్, బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి కీలక పాత్రలో కనిపించి మెప్పించారు.

విశ్లేషణ..

బాడ్ గాళ్స్ సరదాగా సాగే చిత్రం. నలుగురు స్నేహితులు బయటకు వెళ్లాలని అనుకోవడం, అమ్మాయిలు ఇలా బయటకు వస్తే ఎదురయ్యే పరిస్థితులు వంటి వాటితో ప్రథమార్దాన్ని సరదా సరదాగా సాగించారు. నలుగురు స్నేహితులు ఉన్నప్పుడు పుట్టే హాస్యం, వచ్చే సంఘటనల్ని చక్కగా చూపించాడు. అవన్నీ కూడా నేటి ట్రెండ్‌కు తగ్గట్టే ఉంటాయి. ఇంటర్వెల్‌కు మాత్రం మంచి ట్విస్ట్ ఇచ్చి ముగించేస్తాడు.

ఇక సెకండాఫ్‌లో కథ రకరకాల జానర్లోకి వెళ్తుంది. అప్పటి వరకు కామెడీ జానర్ అని అనుకుంటారు. కానీ థ్రిల్లింగ్, క్రైమ్ అని తరువాత తెలుస్తుంది. కామెడీ, థ్రిల్లర్ అంశాల కలయికతో దర్శకుడు సెకండాఫ్‌ను బాగానే లాగాడు. మలేషియా గ్యాంగ్, ఉమెన్ ట్రాఫిక్ గ్యాంగ్, ఈ నలుగురు స్నేహితుల చుట్టూనే ఈ కథను ప్రీ క్లైమాక్స్ వరకు తిప్పాడు. ఇక చివర్లో దర్శకుడు తన సందేశాన్ని ఇచ్చాడు. క్లైమాక్స్ కాస్త ఎమోషనల్‌గానే టచ్ చేసినట్టు అనిపిస్తుంది. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి స్క్రీన్‌ప్లే, కామెడీ పంచ్‌లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

అయితే ఫార్ములా కథ అవ్వడం, ఇలాంటి కథలతో ఇదివరకెన్నో చిత్రాలు రావడం మైనస్ అవుతుంది. నెమ్మదిగా ప్రారంభమైన తీరు, అక్కడక్కడా గాడి తప్పినట్టుగా అనిపించడం కూడా లోపమే అవుతుంది. కానీ ఇది టైమ్-పాస్ కామెడీ కేపర్‌గా నిలుస్తుంది. ఇది ప్రధానంగా ఊహించదగిన కథాంశం కావడంతో తేలికైన, చిన్న ట్విస్టులతో వచ్చే చిత్రాలను ఇష్టపడే ఆడియెన్స్‌కి ఈ మూవీ బాగానే నచ్చే అవకాశం ఉంది.

bad-girls-movie-review-and-rating-in-telugu

అనూప్ రూబెన్స్ సంగీతం ఒక ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు. ఇందులోని పాటలు, నేపథ్య సంగీతం బాగుంటుంది. ఆస్కార్ చంద్ర బోస్ రాసిన సాహిత్యం ఆలోచింపజేసేలా ఉంటుంది. అర్లి గణేష్ సినిమాటోగ్రఫీ చిత్రానికి క్లీన్, గ్లోసీ లుక్ ఇస్తుంది, మలేషియా విజువల్స్ ప్రత్యేకంగా నిలుస్తాయి. దాదాపు 90% సినిమా మలేషియాలో షూట్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాటమ్ లైన్..

బాడ్ గాళ్స్ అనేది ఓ సారి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మంచి సంగీతం, కలర్ ఫుల్ విజువల్స్, కొంత కామెడీ, ఇంకొంత ఎమోషన్‌తో సాగే క్రైమ్ కామెడీ-థ్రిల్లర్ ఓ వర్గాన్ని ఆకట్టుకునేలా ఉంటుంది.

రేటింగ్: 2.5/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+