మెగా, అల్లు ఫ్యామిలీ విభేదాలపై బాలకృష్ణ కామెంట్స్
సినీ వినీలాకాశంలో నటసింహం నందమూరి బాలకృష్ణ 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సినీ, రాజకీయాలతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి బాలకృష్ణ ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎప్పుడెప్పుడా అని నందమూరి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ నుంచి అల్లు ఫ్యామిలీతో విభేదాల వరకు పలు విషయాలను పంచుకున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన కథలు కూడా వినడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఇదే సమయంలో మెగా, అల్లు ఫ్యామిలీతో ఉన్న విభేదాల గురించి కూడా బాలకృష్ణ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. మెగా, అల్లు ఫ్యామిలీలతో తనకు ఎటువంటి విభేదాలు లేవని బాలకృష్ణ స్పష్టం చేశారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్, అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్‌తో చాలా సరదాగా ఉంటానని ఆయన తెలిపారు. ఇటీవల అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 సినిమా షూటింగ్‌కు కూడా తాను వెళ్లానని బాలకృష్ణ వెల్లడించారు. ఆ సమయంలో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌తో చాలాసేపు మాట్లాడటం జరిగిందని బాలకృష్ణ తెలిపారు.

అల్లు అరవింద్‌గారి కోసమే అన్‌స్టాప్‌బుల్ షో చేశానని ఆయన చెప్పుకొచ్చారు. తమ మధ్య విభేదాలు ఏమీ లేవని.. కాకపోతే తరచూ కలుసుకోమని బాలయ్య చెప్పారు. ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉంటామని, అందుకే బయట పెద్దగా కలవనని ఆయన తెలిపారు. కానీ ఏదైనా సినిమా ఈవెంట్స్‌లో కలిసినప్పుడు మాత్రం అందరం బాగా కలిసిపోయి మాట్లాకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్య్వూతో మెగా, అల్లు ఫ్యామిలీలతో తనకు ఎటువంటి విభేదాల్లేవని బాలకృష్ణ స్పష్టం చేసినట్టు అయింది.












Click it and Unblock the Notifications