ఆ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగుంటాడు: బాలకృష్ణ
నందమూరి కుటుంబ సభ్యుల్లో బాలకృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్ కు పడటంలేదని, వీరిమధ్య విభేదాలున్నాయంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కల్యాణ్ రామ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ వైపే నిలబడ్డాడు. దాదాపుగా ఇతర నందమూరి కుటుంబ సభ్యులందరితో వీరు దూరం పాటిస్తున్నారంటున్నారు. దీనికి కారణాలేంటనేది తెలియదుకానీ ఫిలింనగర్ లో ఈ వార్త మాత్రం చక్కర్లు కొడుతుండటంతోపాటు సినీ ప్రియులందరికీ తెలిసిన విషయమే. తాజాగా అన్ స్టాపబుల్ షోలో కూడా ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావద్దని బాలయ్య ముందుగానే షరుతులు విధించారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొట్టేశాడు.
తారక్ బాగుంటాడని బాలయ్యే చెప్పాడు
వస్తున్న వార్తలు సరికావని, బాలయ్య అలా చెప్పలేదన్నారు. ఆ షోలో తాను కూడా పాల్గొన్నానని, బాబీ తన హీరోల గురించి చెప్పారని, తారక్ ప్రస్తావన వస్తే ఎడిటింగ్ లో తీసేశారనడం కూడా సరికాదని, అలా చేయలేదని నాగవంశీ చెప్పారు. గతంలో బాలయ్య ఓ సినిమాకు సంబంధించి ఆ పాత్రను జూనియర్ అయితే బాగా చేస్తాడని చెప్పారని, విభేదాలుంటే ఆయన అలా చెప్పరుకదా అని ప్రశ్నించారు. వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అన్ స్టాపబుల్ షోకు వస్తున్న అతిథులంతా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన మాత్రం తీసుకురావడంలేదు. అలా తేవొద్దని, తెచ్చినా ఎడిటింగ్ లో తీసేయాలని బాలయ్య ఆహా నిర్వాహకులకు కూడా స్పష్టం చేశారంటున్నారు.

అందరూ తారక్ కు ఎంతో సన్నిహితులే
ఈ సీజన్ లో చాలామంది అతిథులు పాల్గొన్నారు. వారంతా దాదాపుగా జూనియర్ ఎన్టీఆర్ తో చాలా సన్నిహితంగా ఉండేవారున్నారు.. మంచి స్నేహితులున్నారు. కానీ వారెవరూ తారక్ మాట ఎక్కడా మాట్లాడలేదు. దీన్నిబట్టి కావాలనే వారంతా అలా మాట్లాడకుండా ఉన్నారని, అలా మాట్లాడితే బాలయ్యకు కోపం వస్తుందన్న ఉద్దేశంతో వ్యవహరించారని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. బాలయ్య తారక్ ను ఏమీ చేయలేడని, తొక్కలేడని, పాన్ ఇండియా స్టార్ అయ్యాడని, తన కొడుకును కూడా పాన్ ఇండియా స్టార్ ను చేసుకోవాలని, అంతేకానీ తారక్ ను తొక్కేయాలని ప్రయత్నిస్తే వారే పాతాళంలోకి పడిపోతారంటూ తారక్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాలయ్య అభిమానులకు, తారక్ అభిమానుకు యుద్ధం నడుస్తోంది.












Click it and Unblock the Notifications