మరో వివాదంలో బాలయ్య..హీరోయిన్ ప్రైవేట్ పార్ట్‌ను తాకిన టీడీపీ ఎమ్మెల్యే
టీడీపీ ఎమ్మెల్యే , హీరో నందమూరి బాలకృష్ణ గత రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సమయంలో హీరోయిన్ అంజలిపై అనుచితంగా ప్రవర్తించారంటూ ఓవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో స్టేజ్‌పై అంజలిని బాలయ్య పక్కకి నెట్టడం విమర్శలకి దారి తీసింది. గతంలో అంజలి బాలకృష్ణతో కలిసి నటించారు. దీంతో ఆ చనువుతో అంజలిని నెట్టి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అయింది.

దీనిపై ఇప్పటికే విశ్వక్ సేన్, నిర్మాత నాగవంశీ రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హీరోయిన్ అంజలి స్వయంగా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. బాలకృష్ణ అలాంటి వ్యక్తి కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే దీనికి సంబంధించిన మరో ఫొటో తెర మీదకు వచ్చింది. అంజలి స్టేజ్‌పైకి వెళ్తున్న సమయంలో తన లెఫ్ట్ హ్యాండ్‌తో ఆమె వెనుక భాగంలో బాలకృష్ణ టచ్ చేశారు. ఆ సమయంలో అంజలి కూడా స్మైల్ ఇస్తూనే వెల్లిపోయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఈ వివాదం ఎన్ని మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications