రజనీకాంత్, విజయ్ లో బాలకృష్ణ ఓటు ఎవరికంటే?
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించారు. తమన్ స్వరాలందించారు. బాలికల సాధికారత గురించి ఈ చిత్రంలో చర్చించడమేకాదు.. ఆపత్కాల సమయంలో మహిళలు ఎలా ధైర్యంగా వ్యవహరించాలనే విషయాన్ని కూడా చక్కగా చూపించారు.
మహిళలకు సంబంధించిన మెసేజ్ ఓరియంటెడ్ గా రూపొందిన ఈ సినిమా కోసం తమిళం నుంచి ఇద్దరు అగ్ర కథనాయకులు పోటీపడుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరుకాగా, మరొకరు దళపతి విజయ్. అనిల్ రావిపూడి తన కామెడీని పక్కనపెట్టి, బాలయ్య తన మాస్ ఇమేజ్ ను పక్కనపెట్టి చేసిన ఈ కొత్త ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది. సినీ ప్రియులంతా ఆదరించారు. అదే సినిమాను తమిళంలో రీమేక్ చేయాలని రజనీ, విజయ్ పోటీపడుతున్నారు.

రజనీకాంత్ ఇటీవలే జైలర్ సినిమాతో వసూళ్ల వర్షం కురిపించారు. తన వయసుకు తగిన పాత్రలో ఎంతో హుందాగా ఆ సినిమాలో నటించారు. అలాగే భగవంత్ కేసరి చిత్రం కూడా తనకు సరిగ్గా సరిపోతుందని, ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని, ఉన్నది ఉన్నట్లుగా తీసినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని రజనీ భావిస్తున్నారు. అలాగే విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. కొత్త పార్టీని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తుందని స్పష్టం చేశారు. భగవంత్ కేసరి చిత్రంలో మహిళలకు ఉన్న మెసేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేస్తే తన రాజకీయ పార్టీకి ఉపయోగపడుతుందని, స్త్రీలకు దగ్గరవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
అయితే ఈ చిత్ర నిర్మాతలు రీమేక్ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఇద్దరు కథానాయకులు పోటీపడుతుండటంతో కథానాయకుడిగా నటించిన బాలకృష్ణ పాత్ర కీలకమైంది. విజయ్ కన్నా రజనీకాంత్ తో బాలయ్యకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవలే ఆయన విజయవాడలో ఎన్టీఆర్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత వైసీపీ రజనీపై విమర్శల వర్షం కురిపించిందే. ఆ తర్వాతే చంద్రబాబుతోపాటు బాలయ్యకు కూడా రజనీతో సంబంధాలు బలోపేతమయ్యాయి. ఈ నేపథ్యంలో బాలయ్య రజనీకాంత్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications