'చిన్నారి పెళ్లి కూతురు' సీక్రెట్ ఎంగేజ్ మెంట్.. ఆరేళ్లు డేటింగ్..వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఆనందిగా అందరి మనసుల్ని దోచుకుంది అవికా గోర్. అప్పట్లో ఆనంది, జగదీష్ క్యారెక్టర్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. అంతలా ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే ఇందులో ఆనంది పాత్రలో మెరిసిన నటి అవికా గోర్ తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకుంది. మరి వరుడు ఎవరో తెలుసా..?

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో ప్రతి తెలుగింటికి పరిచయం అయిన నటి అవికా గోర్. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. సినిమా చూపిస్త మామ, వధువు, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఆమె తాజాగా నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

నటి అవికా గోర్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన మిలింద్ చాంద్వానీ తో లవ్ మ్యారేజ్ చేసుకోబోతోంది. ఈ మేరకు అత్యంత సన్నిహితుల మధ్య బుధవారం నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది అవికా గోర్. దీంతో ఆ పిక్స్ ఒక్కసారిగా వైరల్ గా మారాయి.

Balika Vadhu Star Avika Gor Engaged A New Chapter for the Young Bride Icon

'అతడు ప్రేమ అడిగాడు. నేను భావోద్వేగానికి లోనయ్యాను. ఓకే చెప్పాను. అతడు మనసులో మాట చెబుతున్నప్పుడు నేను మూవీ లవర్ గా మారిపోయా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్లో-మోషన్ డ్రీమ్స్ కనిపించాయి. అతను లాజిక్ గా, ప్రశాంతంగా ఉన్నాడు. అతను అడిగినప్పుడు నా కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి' అంటూ అవికా గోర్ ఎమోషనల్ పోస్టు చేశారు.

ఇక అవికా గోర్ ను పెళ్లి చేసుకోబోయే మిలింద్ చాంద్వానీ ఒక సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆయన ఐఐఎం అహ్మదాబాద్ లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం క్యాంప్‌ డైరీస్‌ అనే ఓ ఎన్జీవో నిర్వహిస్తున్నారు. అయితే 2019లో క్యాంప్ డైరీస్ ద్వారా అవికా గోర్, మిలింద్ మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+