చంద్రబాబుపై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ పై ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు పేరు వాడుకుని ఎంతోమంది లబ్ధి పొందారని, చంద్రబాబు నాయుడు ఎంతోమంది జీవితాలను నిలబెట్టారని వ్యాఖ్యానించారు. బాబు అరెస్ట్ కావడం ఎంతో బాధ పెట్టిందని బండ్ల గణేష్ ఆవేదన వెలిబుచ్చారు.
చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేయడంతో ఈసారి వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని తాను భావించడం లేదన్నారు. ఐటీ ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లి బొడ్రాయి ముందు కూర్చుని ధర్నాలు చేయాలని, చంపుతారా చంపేయండని ధైర్యంగా ఉద్యోగులు చెప్పాలన్నారు. చంద్రబాబు జైలులో మగ్గుతుంటే అన్నం కూడా తినాలనినిపించడంలేదన్నారు.

2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారని, ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. తాజాగా బండ్ల గణేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరలవుతున్నాయి. బండ్ల గణేష్ నిర్మాతగా మళ్లీ కెరీర్ పరంగా బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. టెంపర్ సినిమా తర్వాత బండ్ల గణేష్ సినీ నిర్మాణానికి దూరంగా ఉన్నారు. టెంపర్ భారీ లాభాలను అందించినా వేర్వేరు కారణాల వల్ల ఆయన సినిమాలను నిర్మించడంలేదు.
బండ్ల గణేష్ రాజకీయ రంగంలో విజయవంతమైన నాయకుడవ్వాలని కొందరు అభిమానులు కోరుకుంటున్నారు. తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలను రీ రిలీజ్ చేయాలని బండ్ల గణేష్ భావిస్తున్నారు. రోజురోజుకు బండ్ల గణేష్ ను అభిమానించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ద్వారా బండ్ల గణేష్ తన అభిమానులకు దగ్గరవుతున్నారు. నిత్యం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటాడు.












Click it and Unblock the Notifications