ఈ టీజర్ చూస్తే నవ్వి నవ్వి పొట్టచెక్కలే..!
'కోర్ట్' మూవీతో సూపర్ హిట్ అందుకున్న జంట హర్ష్ రోషన్- శ్రీదేవి. వీరిద్దరి కాంబోలో వస్తున్న మరో క్రేజీ మూవీ 'బ్యాండ్ మేళం'.. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు యూత్ ను ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. టీజర్ మొత్తం ఫుల్ కామెడీగా.. సరదాగా సాగిపోయింది. సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసిందీ టీజర్. ఇక ఈ మూవీ మార్చి 13 న గ్రాండ్ గా విడుదల కానుంది.

టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ హర్ష్ రోషన్- శ్రీదేవి మరోసారి జత కట్టారు. గతంలో కోర్ట్ మూవీతో హిట్ కొట్టిన ఈ క్రేజీ పెయిర్ మరోసారి బ్యాండ్ మేళం సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవల ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన స్పెషల్ గ్లింప్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజైంది. టీజర్ లో డైలాగ్స్ బాగున్నాయి. చాలా సరదాగా టీజర్ సాగిపోయింది. టీజర్ తోనే నవ్వులు పూయించారు హర్ష్ రోషన్- శ్రీదేవి. టీజర్ చూస్తుంటే మరోసారి వీరిద్దరి కెమిస్ట్రీ థియేటర్లలో ఫుల్ పైసా వసూల్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన తిప్పుకుంటన్నవ్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఇప్పటికే 'బ్యాండ్ మేళం' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. మార్చి 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. 'కోర్ట్' మూవీ ఆంధ్ర బ్యాక్ డ్రాప్ లో సాగిన విషయం తెలిసిందే. అయితే 'బ్యాండ్ మేళం' మూవీ మాత్రం తెలంగాణ నేపథ్యంగా ఉండనుంది. ఇక ఈ చిత్రానికి సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించారు. కాగా విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ఇది. దాంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.












Click it and Unblock the Notifications