"చిన్నప్పటి నుంచి తను నా పెళ్లాం అనుకున్నా"

'కోర్ట్' మూవీ గుర్తుందా..? గతేడాది సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ ఇదే.. ఈ మూవీలో జంటగా కాకినాడ శ్రీదేవి- రోషన్ చింపేశారు. తొలి సినిమా అయినా తమ ఇన్నోసెంట్ నటనతో అందరినీ కట్టిపడేశారు. అయితే ఈ హిట్ కాంబో మరోసారి రిపీట్ కానున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న 'బ్యాండ్ మేళం' మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ తాజాగా రిలీజైంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

1 నిమిషం 12 సెకన్ల నిడివితో విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఇదొక ప్రేమ కథ సినిమా అని తెలుస్తోంది. లవ్ లో ఓడిపోయిన వ్యక్తి ఎలాంటి ఆవేదన అనుభవిస్తాడో ఈ వీడియో ద్వారా చూపించినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో హీరో రోషన్.. చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయిని గుండెల్లో పెట్టి చూసుకున్నానని తనని చూసిన ప్రతిసారి ఎక్కడ జారిపోతుందో అనే భయం ఉండేది కానీ ఇప్పుడు ఆ భయం లేదు.. ఎందుకంటే తను నా గుండెల్లో లేదంటూ ఎమోషనల్ డైలాగ్స్ కట్టిపడేస్తున్నాయి.

bandmelam Valentine s Special Glimpse Out Now Harsh Roshan amp amp Sridevi Bring Heartbeats to Screen

ఇక 'బ్యాండ్ మేళం' మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. వచ్చే మార్చి 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. 'కోర్ట్' మూవీ ఆంధ్ర బ్యాక్‌ డ్రాప్‌ లో సాగిన విషయం తెలిసిందే. అయితే 'బ్యాండ్ మేళం' మూవీ మాత్రం తెలంగాణ నేపథ్యంగా ఉండనుంది. ఇక ఈ చిత్రానికి సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించాడు. కాగా విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. మరి రోషన్- శ్రీదేవి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీ ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+