'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఫస్ట్ రివ్యూ.. రవితేజ హిట్ కొట్టాడా..?
మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమైంది. జనవరి 10న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూరులో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. అలాగే ఈ మూవీలో రవితేజకు జోడిగా ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సినీ సెలబ్రిటీల కోసం ఈ మూవీ స్పెషల్ షో వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఫస్ట్ రివ్యూ చూస్తే..
సినిమాలో హీరో రవితేజ,డింపుల్ హయతి భార్య భర్తలు. వాళ్ల లైఫ్ సాఫీగా సాగిపోతున్న క్రమంలో అతనికి ఆషిక రంగనాథ్ పరిచయం అవుతుంది. ఈ క్రమంలో రవితేజ ఆమెతో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఇద్దరి హీరోయిన్ల మధ్య తాను ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇటు భార్య, అటు ప్రేయసి ఇబ్బందుల వేళ రవితేజ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనేది కథాంశంగా ఈ మూవీని రాసుకున్నారు డైరెక్టర్ కిశోర్ తిరుమల.
ఈ క్రమంలో సినిమాలో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా సాగిపోతుందని టాక్. ఎక్కడా బోర్ కొట్టకుండా రవితేజ మార్క్ ఎంటర్ టైనింగ్ తో మూవీ ఉంటుందని తెలుస్తోంది. అలాగే మూవీలో ఫ్యామిలీ రిలీషన్స్ లో ఉండే బంధాలను గొప్పగా చూపించినట్లు సమాచారం. మొత్తానికి అటు భార్య చేతిలో ఇటు లవర్ చేతిలో నలిగిపోయే క్యారెక్టర్ లో రవితేజ చాలా అద్భుతమైన నటన ప్రదర్శించినట్లు టాక్ వినిపిస్తోంది. పూర్తి రివ్యూ కోసం మరో రెండు రోజులు ఆగాల్సిందే.

ఇక ఈ మూవీలో సునీల్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, సత్య, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను ఎస్ ఎల్వి సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications