ఫైనల్ గా 'భోళాశంకర్' ఎంత వసూలు చేసిందో తెలుసా?
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా రూపుదిద్దుకున్న చిత్రం భోళా శంకర్' మూవీ ఆగస్టు 11న విడుదలైంది. 'ఏకే ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రని పోషించింది. మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు. సుశాంత్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. విడుదలైన మొదటిరోజు మొదటి ఆటకే ఘోరమైన డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఏ దశలోను ఈ సినిమా థియేటర్ల నుంచి ఒక్కరూపాయి కూడా వసూలు చేయలేకపోయింది. ఆ సినిమా టోటల్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయో పరిశీలిస్తే..
ఉత్తరాంధ్ర 3.38 cr
ఈస్ట్ 2.45 cr
వెస్ట్ 2.78 cr
గుంటూరు 2.95 cr
కృష్ణా 1.92 cr
నెల్లూరు 1.38 cr
నైజాం 7.00 cr
సీడెడ్ 3.32 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 25.18 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.89 cr
ఓవర్సీస్ 2.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 29.33 cr (షేర్)

ఈ చిత్రానికి రూ.78.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.79 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.29.33 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫైనల్ గా రూ.49.67 కోట్ల భారీ భారీ నష్టంతో డిజాస్టర్ గా మిగిలింది












Click it and Unblock the Notifications