ఖరీదైన విల్లాను కూతురికి గిప్ట్‌గా ఇచ్చిన బిగ్‌బి...
బిగ్ బి పేరు తెలియని సీని అభిమానులు ఉండరు. సాధారణ స్థాయి నుంచి బిగ్‌బి, బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగారు అమితాబ్ బచ్చన్..బాలీవుడ్‌లో ఆయన నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌కు ముంబయిలో ఖరీదైన ఇల్లు ఉన్నాయి. తాజాగా అందులో ఒక ఇళ్లు తన కూతురు శ్వేత నందాకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఇంటి ఖరీదు సుమారు 50 కోట్లు ఉంటుందని అంచనా. ఈ విల్లా ముంబయిలోని జూహులో ఉంది.
ఈ బంగ్లాకు 'ప్రతీక్ష' అనే పేరు కూడా ఉంది. ఈ విల్లా అంటే బిగ్‌బికి ఎంతో ఇష్టమట. అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా నందాకి ఇన్ని కోట్లు విలువ చేసే బంగ్లాను కానుకగా ఇవ్వడంతో ఈ వార్త కాస్త బి టౌన్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అమితాబ్ బచ్చన్ మొదటిసారిగా కొనుగోలు చేసింది ఈ ఇల్లునే కావడం విశేషం. అంతేకాదు, ఈ ఇల్లు బిగ్‌బికి ఎంతో ప్రత్యేకమైనది కూడా. ఎందుకంటే, అమితాబ్ బచ్చన్ తల్లిదండ్రులు ప్రతీక్ష ఇంట్లోనే ఉండేవారు. కవి హరివంశ్‌రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్‌లు అమితాబ్ తల్లిదండ్రులు. వారు ఈ ఇంట్లో ఉండేవారు. ఈ ఇంటికి అమితాబ్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ ప్రతీక్ష అనే నామకరణం కూడా చేశారట..

రూ. 50 కోట్లు విలువ చేసే ప్రతీక్ష బంగ్లా : ఈ ప్రతీక్ష విల్లా జుహులోని విఠల్ నగర్ కో ఆపరేటివ్ హోసింగ్ సోసైటీ పరిధిలోకి వస్తుంది. ఈ విల్లా రెండు ప్లాట్లుగా ఉంటుంది. ఇందులో ఒకటి 890.47 చదరపు మీటర్లు ఉండగా, మరొక ప్లాటు 674 చదరపు మీటర్లు ఉంటుంది. ఈ బంగ్లా విలువ సుమారు రూ. 50 కోట్లు విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2007 లో అమితాబ్ కొడుకు అభిషేక్, నటి ఐశ్వర్య పెళ్లి వేడుకలు 'ప్రతీక్ష' ,'జల్సా' బంగ్లాలోనే జరిగాయి.
ఇక్కడికి సమీపంలోనే 'జనక్' అనే మరో ఇల్లు ఉంది. అదికూడా అమితాబ్ బచ్చన్‌దే. ఆ ఇంటిని అమితాబ్ ఆఫీసు కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీక్ష బంగ్లా ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ నివాసముంటున్న జల్సా ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అమితాబ్ బచ్చన్ తన కుమార్తెకు బహుమతిగా ఈ విల్లాను నవంబర్ 9 న బదిలీ చేసినట్లు సమాచారం. స్టాంప్ డ్యూటీగా రూ.50.65 లక్షలు కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ తన కూతురు శ్వేత నందకు ఇన్ని కోట్లు విలువ చేసే ఇంటిని బహుమతిగా ముట్టచెప్పడం ఇప్పుడు సంచనలంగా మారింది.












Click it and Unblock the Notifications