Bigg Boss 9 : మూడు వారాలకు ప్రియ శెట్టి ఎంత తీసుకుందో తెలుసా..?
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో 'అగ్ని పరీక్ష' షో ద్వారా ఆడియన్స్ ఓటింగ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ ప్రియ శెట్టి ఎలిమినేషన్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. హౌస్‌లోకి రాకముందు 'అగ్ని పరీక్ష'లో చక్కటి యాటిట్యూడ్, చురుకైన ఆటతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రియ శెట్టికి, బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత సీన్ పూర్తిగా మారింది. ఆమె ప్రవర్తనలో కనిపించిన 'యాటిట్యూడ్' ఆడియన్స్‌కు ఏమాత్రం నచ్చలేదు. ఫలితంగా, ఆమెను ఎలిమినేటర్ అయింది.
సోషల్ మీడియాలో భారీగా నెగిటివ్ క్యాంపెయిన్‌లు నడిచాయి. బయటకు వచ్చి చూసుకున్నాక తనపై ఇంత వ్యతిరేకత ఉందా అని ప్రియ ఆశ్చర్యపోవడం ఖాయం.ప్రియ, పవన్ కల్యాణ్‌లకు ఆడియన్స్ నుంచి అత్యల్ప ఓట్లు పడ్డాయి.వీరిద్దరిలో పవన్ కల్యాణ్ సేవ్ అయ్యి, ప్రియ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ప్రియ ఎలిమినేషన్ పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది నెటిజన్లు ఇది అన్యాయం, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంటేనే కంటెంట్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, పవన్ కల్యాణ్, ఫ్లోరా షైనీ వంటి కంటెస్టెంట్‌ల వల్ల హౌస్‌కు ఎలాంటి కంటెంట్ రావడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, స్ట్రాంగ్ గేమ్ ఆడే ప్రియ ఎలిమినేషన్ బిగ్ బాస్ గేమ్ రసవత్తరంగా మారడానికి మంచిది కాదనే వాదన వినిపిస్తోంది.
ప్రియ శెట్టి కేవలం మూడు వారాలు హౌస్‌లో ఉన్నందుకుగాను రూ. 2 లక్షల 40 వేలు (వారానికి రూ. 80,000 చొప్పున) పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి సంబంధాలు వస్తున్నా వద్దని, సినిమాల్లోకి వెళ్లాలనే లక్ష్యంతో తల్లిదండ్రులతో పోరాడి మరీ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ప్రియ శెట్టి, ఈ షో మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.












Click it and Unblock the Notifications