ఒక్క నైట్ పడుకుంటే అంత రేటు ఇస్తామన్నారు..'ఢీ' డ్యాన్సర్ సంచలనం
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చాలామంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ లైంగిక వేధింపులకు గురయ్యారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఆ బ్యూటీ మరెవరో కాదు.. బిగ్ బాస్ ఫేం నైనిక. 'ఢీ' డ్యాన్స్ షోతో నైనిక ప్రస్థానం మొదలైంది. ఒక డ్యాన్సర్‌గా ఆమె తన అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'ఢీ' షోలో ఆమె డ్యాన్స్ నైపుణ్యం, గ్రేస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ షోలో ఆమెను 'పొట్టి పిల్ల' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. డ్యాన్సర్‌గా ఆమె సంపాదించుకున్న గుర్తింపుతో నటన వైపు అడుగులు వేశారు. 'పిల్లా పడేసావే' వంటి టీవీ సీరియల్స్‌లో నటించి నటిగా కూడా ప్రశంసలు అందుకున్నారు.
డ్యాన్సర్, నటిగా సాధించిన ఫేమ్ నైనికకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ప్రవేశించే అవకాశాన్ని కల్పించింది. హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె మొదట్లో చాలా ఎనర్జిటిక్‌గా, చురుగ్గా కనిపించారు. ముఖ్యంగా 'క్లాన్ లీడర్'గా ఆమె ఆడిన గేమ్ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చే ఏకైక కంటెస్టెంట్‌గా ఆమె కనిపించారు. అయితే, కొన్ని వారాల తర్వాత ఆమె ఆటలో వేగం తగ్గిపోయింది. దీంతో ఆమె కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ లో ఆమె ప్రయాణం తక్కువ కాలమే అయినా, ఆమె తనదైన ముద్ర వేశారు.

సోషల్ మీడియాలో నైనికకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా నైనిక జబర్దస్త్ వర్ష హెస్ట్‌గా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన ఘటనల గురించి షేర్ చేసుకున్నారు. నేను ఒకర్ని గాఢంగా ప్రేమించానని అయితే అతను నన్ను మోసం చేశాడని వెల్లడించింది. నా కెరీర్‌లో కాస్టింగ్ కౌచ్‌ను కూడా ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది.
నాకు తెలిసిన వ్యక్తి ఫోన్ చేసి మీ ఫొటోలు అసభ్యకరంగా బయటకు వెళ్తున్నాయని, కొన్ని వెబ్‌సైట్స్‌లో ఫొటోలతో పాటు రేట్ కూడా ఫిక్స్ చేసి పెడుతున్నారని తెలిపారు. ఇది విని నేను షాక్ అయ్యానని , నా ప్రమేయం లేకండా ఇంత జరుగుతుందా అని ఆశ్చర్యపోయానని నైనిక వెల్లడించింది. ఇలాంటి వాళ్లు చిన్న పిల్లలను, కుక్కలను కూడా వదలరని నైనిక కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయింది. సొంత మనుషులు సైతం మోసం చేశారని ఈ సందర్భంగా తెలిపింది. మంచి కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకోవాలనేదే తన కోరిక అని వెల్లడించింది. ప్రస్తుతం నైనిక మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.
-
మెగా హీరో భార్యకు ఏమైంది?.. ఆ సీన్ చూస్తే దయ్యం పట్టినట్లే ఉంది! వీడియో -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
ధురంధర్ 2 ట్విట్టర్ రివ్యూ: మాస్టర్ పీస్.. ఎపిక్ బ్లాక్ బస్టర్ -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !!












Click it and Unblock the Notifications