హేమను టచ్ చేయవద్దు.. పోలీసులకు బడా రాజకీయవేత్త వార్నింగ్?
బెంగళూరు శివారులోని ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. టాప్ మోస్ట్ సెలబ్రిటీలంతా అదే పార్టీలో పాల్గొనడంతోపాటు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని విచారించగా అది నిజమే అని తేలడంతో అందరూ షాక్ అయ్యారు. రేవ్ పార్టీ కేసు సంచలనంగా మారింది. స్టార్ సెలబ్రిటీలందరికీ బెంగళూరు క్రైం పోలీసులు నోటీసులు పంపించారు. నోటీసులందుకున్నవారిలో తెలుగు నుంచి హేమ కూడా ఉన్న విషయం తెలిసిందే.
విచారించి వేదిలేయండి..
పోలీసుల విచారణకు మాత్రం హేమ హాజరవలేదు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానంటూ లేఖ రాసింది. పోలీసులు మాత్రం ఆ లేఖను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరలవుతోంది. బెంగళూరు సీసీబీ పోలీసుల నుంచి హేమను ఈ కేసు నుంచి తప్పించేందుకు ఓ బడా రాజకీయ నేత ప్రయత్నిస్తున్న సినీ పరిశ్రమలో వార్త వైరల్ గా మారింది. హేమను అరెస్ట్ చేయడానికి వీల్లేదని, కేవలం విచారించి వదిలేయాలంటూ ఆయన పోలీసులకు సూచించినట్లు తెలుస్తోంది. ఆమె పేరు బయటకు రాకుండా చూడాలంటూ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

భారీగా పొలిటికల్ బ్యాగ్రౌండ్
పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉండటంతోనే హేమ పోలీసుల విచారణకు హాజరుకాలేదనే ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు హేమను వదిలేయాలంటూ సీసీబీ అధికారులకు పదే పదే ఫోన్ చేస్తున్న రాజకీయ నాయకుడు కూడా పెద్ద రాజకీయవేత్త అని, తెరవెనక అతనికి బ్యాగ్రౌండ్ ఉందనే ప్రచారం నడుస్తోంది. దీనివల్లే పోలీసులు చూసీ చూడనట్లుగా హేమపట్ల వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. కన్నడ మీడియాలో ఇలాంటి వార్తలు వస్తుండటంవల్ల తెలుగు సినీ పరిశ్రమ పరువు పోయినట్లవుతుందని అభిమానులు మండిపడుతున్నారు. 100 మందికి పైగా రేవ్ పార్టీలో పాల్గొనగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్స్ లో బయటపడ్డాయి .












Click it and Unblock the Notifications