వార్ 2 మూవీ యూనిట్‌కి బిగ్ షాక్.. ఎన్టీఆర్ ఫోటోస్ లీక్
గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. కొమురం భీమ్ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. మూవీ నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో.. ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే దేవర 1 బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 'వార్' సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా తారక్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం కావడంలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కూడా నటిస్తుండడంతో హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి తారక్ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడు తాజాగా వార్ 2 మూవీ యూనిట్ కి భారీ షాక్ తగిలింది.

మూవీ షూటింగ్ నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది. ఓ వైపు చిత్ర బృందానికి అనుకోని షాక్ తగిలినప్పటికీ.. తారక్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వార్ 2 తర్వాత దేవర 2, ఎన్టీఆర్31 చిత్రాలు చేయనున్నట్టు సమాచారం.
War2 #tarakanna looks #War2 #ntrneel pic.twitter.com/j8Z7Kw6qEA
— Ultimate 🕊️ (@IamGanesh1718) February 11, 2025
మరోవైపు రీసెంట్ గానే FIFA సోషల్ మీడియా అకౌంట్ పోస్ట్‌లో ఎన్టీఆర్ ని పేరుతో పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఫుట్ బాల్ ఆటగాళ్లు నెయ్‌మార్, టేవెజ్, క్రిస్టియానో రొనాల్డో.. బర్త్ డే ఫిఫా వరల్డ్ కప్ తన ఇన్‌స్టా పోస్టులో.. వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ లో వారి ముగ్గురి మొదటి అక్షరాలను NTR అంటూ.. RRR మూవీలోని నాటు నాటు హుక్ స్టెప్ కి వారు డాన్స్ వేస్తున్నట్లుగా రిలీజ్ చేసింది. అలానే బెంగుళూరులో ఎడ్ షీరన్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ పాడి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు షీరన్.












Click it and Unblock the Notifications