సానియా మీర్జా విడాకుల్లో బిగ్ ట్విస్ట్..!

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణీ సానియా మీర్జా తన భర్త షోయబ్‌ మాలిక్‌కు విడాకులు ఇచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే. విడాకులపై సానియా అధికారికంగా స్పందించికపోయినా.. కొద్ది రోజుల క్రితం ఆమె తన సోషల్ మీడియా అకౌంట్‌లో విడాకులపై పరొక్షంగా హింట్ ఇస్తూ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. జీవితంలో పెళ్లి కష్టమైనదే, విడాకులు కష్టమైనదే వీటిలో మీకు ఏది కష్టంగా అనిపిస్తే దాన్ని ఎంచుకోండి అంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది.

దీంతో సానియా విడాకులు తీసుకుంటుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సానియా మీర్జా పోస్ట్ చేసిన రెండు రోజులకే భర్త షోయబ్ మాలిక్‌ మరో పెళ్లి చేసుకుని షాకిచ్చాడు. పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు.దీంతో సానియా మీర్జా - షోయబ్ మాలిక్ విడిపోయారని అందరికి అర్థం అయింది.

Big twist on Sania Mirza and Shoaib Malik divorce

అయితే సానియాకు షోయబ్ విడాకులు ఇచ్చాడా లేదా అనే అనుమానం తలెత్తింది. దీనిపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. సంప్రదాయం ప్రకారమే సానియా మీర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకుందని ఆయన తెలిపారు. తాజాగా సానియా మీర్జాకు విడాకులకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది.

సానియా మీర్జా ముస్లిం పద్దతిలో కాకుండా షరియా చట్టంలోని ఖులా పద్దతి ద్వారా విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముస్లిం సంఘంలో ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు చెప్పే విధానం ఒకటి ఉంది.దీని ద్వారా భర్తలు ఒకే సమయంలో మూడు సార్లు 'తలాక్', 'తలాక్', 'తలాక్' అని చెప్పడం ద్వారా విడాకులు పొందవచ్చు. ట్రిపుల్ తలాక్‌ను చాలా ముస్లిం దేశాలు నిషేధించాయి. ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరంగా పరిగణిస్తున్నాయి.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, సిప్రస్, ట్యునీషియా, మలేషియా, ఇరాన్, శ్రీలంక, జోర్డాన్,అల్జీరియా, ఇండోనేషియా, యూఏఈ, ఖతార్, సుడాన్, మొరొకో, ఈజిప్ట్, ఇరాక్, బ్రూనేలాంటి దేశాలు నిషేధించాయి. తాజాగా ఈ జాబితాలో తాజాగా భారతదేశం చేరింది. ముస్లిం మహిళల నుంచి సుప్రీంకోర్టుకు పెద్ద ఎత్తున పిటిషన్లు వెల్లువెత్తడంతో, కోర్టు ఇది రాజ్యాంగవిరుద్ధం అంటూ 2017 ఆగస్టులో దానిని నిషేధించింది.

Big twist on Sania Mirza and Shoaib Malik divorce

అందుకే సానియా మీర్జా -షోయబ్‌ మాలిక్‌ షరియా చట్టం ద్వారా విడాకులు తీసుకున్నారని సమాచారం. ష‌రియా చ‌ట్టంలో పేర్కొన్న‌ ''ఖ‌లా'' అనేది ముస్లిం మ‌హిళ‌లకు భ‌ర్త‌కు విడాకులు ఇచ్చే స్వేచ్ఛ‌ను ఇస్తోంది. ఇందులో ముస్లిం భర్త రెండో వివాహం చేసుకోవడం చట్టబద్ధం. అందుకే సానియా దంపతులు విడాకుల కోసం ష‌రియా చ‌ట్టం వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే సానియా విడాకుల కోసం ఎంచుకున్న విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+