Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10లోకి బోల్డ్ బ్యూటీ, యాంకర్, కమెడియన్.. వైరల్ లిస్ట్ ఇదే!

Bigg Boss 10 Telugu: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' పదో సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌ను 'దశావతారం' అనే కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. "10X సర్‌ప్రైజ్‌లు.. ఆటే ఒక సవాల్" అనే కొత్త ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ప్రోమోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

అల్లు అర్జున్ 'రాకా’పై మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్!
అల్లు అర్జున్ 'రాకా’పై మంచు లక్ష్మి సెన్సేషనల్ కామెంట్స్!

ఇ దశావతారం థీమ్ వెనుక బిగ్ బాస్ టీమ్ అత్యంత రహస్యమైన, ఆసక్తికరమైన గేమ్ ప్లేను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా దశావతారం అంటే పది రూపాలు. అంటే ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్లు ప్రతివారం లేదా ప్రతి దశలో 10 భిన్నమైన రూపాలు, మైండ్ గేమ్స్, కఠినమైన రూల్స్, టాస్కులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత 9 సీజన్లలో చూడని కొత్త తరహా గేమ్ ఫార్మాట్ తో ఈ సారి కంటెస్టంట్లను పరీక్షించనున్నారు.

Bigg Boss 10 Telugu Contestants List Dasavatharam Theme and Leaked Contestants Check out the viral List Here

వైరల్ అవుతున్న కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే!
అయితే ఈ మైలురాయి సీజన్ కు సంబంధించి ప్రమోషనల్ హడావిడి సోషల్ మీడియా రూమర్స్ నెట్టింట తీవ్ర స్థాయిలో ఊపందుకున్నాయి. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టంట్ల వివరాలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సారి హౌస్‌లోకి వెళ్లేందుకు పలువురు ప్రముఖ సినీ నటీనటులు, టీవీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, పాపులర్ కమెడియన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నివేదికల ప్రకారం.. టెంపర్ సినిమా ఫేమ్ వంశీ, యంగ్ నటుడు ఆదిత్య(ఆదిత్), బుల్లితెర నటి సుహాసిని, గ్లామరస్ యాంకర్ వర్షిణి, బోల్డ్ బ్యూటీ సీరత్ కపూర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్-బుల్లితెర నటి సౌందర్య, జబర్దస్త్ కమెడియన్లు రాంప్రసాద్, నరేష్ వంటి సెలబ్రిటీలు కంటెస్టంట్ల జాబితాలో ఉన్నట్లు సమాచారం.

రవితేజ కెరీర్‌లో సరికొత్త రికార్డ్.. 'ఇరుముడి’ తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా?
రవితేజ కెరీర్‌లో సరికొత్త రికార్డ్.. 'ఇరుముడి’ తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా?

అయితే ప్రతీ ఏటా బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే వరకు నిర్వాహకులు కంటెస్టంట్ల తుది జాబితాను అత్యంత గోప్యంగా ఉంచుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ జాబితా ఎంతవరకు నిజమనేది గ్రాండ్ లాంచ్ రోజే అధికారికంగా స్పష్టం కానుంది. మరి ఈ వైరల్ జాబితాలో ఉన్న వారిలో ఎవరెవరు హౌస్ లోకి అడుగుపెడతారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+