'బిగ్ బాస్'పై రూ.2 కోట్ల జరిమానా?.. లీగల్ చిక్కుల్లో షో!

Bigg Boss Show: బిగ్‌ బాస్ షో సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోంది. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది. ఎప్పుడూ గొడవలు, డ్రామా, వివాదాలతో వార్తల్లో ఉండే సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్ 19' ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది. షో మేకర్స్ కత్రినా కైఫ్ 'చిక్నీ చమేలి', ఇమ్రాన్ ఖాన్ 'ధత్ తేరీ కీ' అనే రెండు పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి.

మిడ్-డే ఇండియా ప్రకారం.. ఫోనోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ లిమిటెడ్(పీపీఎల్) సంస్థ 'బిగ్ బాస్ 19' మేకర్స్‌కు లీగల్ నోటీసు పంపింది. సెప్టెంబర్ 3న ప్రసారమైన బిగ్ బాస్ 19 11వ ఎపిసోడ్‌లో అగ్నిపథ్ చిత్రం నుంచి 'చిక్నీ చమేలి', 'గోరీ తేరే ప్యార్ మే' చిత్రం నుండి 'ధత్ తేరి కీ' పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆ నోటీసులో పేర్కొంది. రియాలిటీ షోకు మద్దతు ఇస్తున్న ఎండెమోల్ షైన్ ఇండియా సంస్థ 'తప్పనిసరి పబ్లిక్ పర్ఫార్మెన్స్ లైసెన్స్' తీసుకోకుండా ఈ సౌండ్ రికార్డింగ్‌లను ఉపయోగించిందని పీపీఎల్ ఇండియా ఆరోపించింది. సెప్టెంబర్ 19న జారీ చేయబడిన ఈ నోటీసును అడ్వకేట్ హితేన్ అజయ్ వాసన్ అందించారు. దీనికి సంబంధించి ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్లు థామస్ గౌసెట్, నికోలస్ చజారైన్, దీపక్ ధర్‌లను బాధ్యులుగా పేర్కొన్నారు.

Bigg Boss 19 Legal Trouble Rs 2 Crore Copyright Notice Over Song Usage

న్యాయ బృందం ఏమందంటే?
న్యాయ బృందం వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రెండు పాటల లైసెన్స్ సోనీ మ్యూజిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియాకు ఉంది. పీపీఎల్ దగ్గర 450కి పైగా మ్యూజిక్ లేబుల్స్ లైసెన్సులు ఉన్నాయి. కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 30 కింద ఎండెమోల్ షైన్ ఇండియా లైసెన్స్ పొందకపోవడం వల్ల, ఈ పాటల ఉపయోగం 'తెలిసి చేసిన ఉల్లంఘన' కిందకు వస్తుందని పీపీఎల్ వాదిస్తోంది.

రూ.2 కోట్ల పరిహారం డిమాండ్
పీపీఎల్ సంస్థ షో మేకర్స్‌ను రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని, అవసరమైన లైసెన్స్ రుసుమును చెల్లించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, అనుమతి లేకుండా ఆ పాటల ట్యూన్ రికార్డింగ్‌లను మళ్లీ ఉపయోగించకూడదని నోటీసు కూడా జారీ చేసింది.ఈ వార్తపై ఎండెమోల్ షైన్ ఇండియా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ ఇప్పటివరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+