ప్రియుడితో బిగ్‌బాస్ 8 న‌టి ఎంగేజ్‌మెంట్‌.. పెళ్లి ఎప్పుడో తెలుసా..?

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 8 న‌టి సోనియా ప్రేమించిన వ్య‌క్తితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సారి బిగ్‌బాస్ షోలో పాల్గొన్న న‌టి సోనియా ఇటీవ‌లే ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చింది. ఈసారి సీజ‌న్‌లో ఎక్కువ‌గా నెగిటివి సంపాదించుకుంది ఈ న‌టి. తాజాగా, ఈ అమ్మ‌డు త‌న ప్రియుడు యష్ పాల్‌ను ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలో చాలా సింపుల్గా వీరి నిశ్చితార్థ వేడుక జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ఇప్ప‌డు నెట్టింట తెగ‌ వైరల్ అవుతోంది.

న‌టి సోనియా మంథనికి చెందిన‌ది. తెలుగులో యాంకర్‌గా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలా ప్ర‌స్తుతం న‌డుస్తున్న తెలుగు బిగ్‌బాస్ 8వ సీజన్‌లో ఓ కంటెస్టెంట్‌గా ఇంట్లోకి అడుగుపెట్టింది. అయితే, సీజ‌న్ ప్రారంభంలో సోనియా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది. కానీ త‌ర్వాత బుల్లితెర న‌టుడు నిఖిల్-పృథ్వీల‌తో నడిపిన లవ్ ట్రాక్‌తో బ‌య‌ట ఆమెపై విపరీతమైన నెగిటివిటీ వ‌చ్చింది. దీంతో త‌క్కువ స‌మ‌యంలోనే ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చేసింది.

Bigg Boss 8 actress s engagement to boyfriend Do you know when the wedding will be

డిసెంబ‌ర్‌లో పెళ్లి..

బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత బుల్లితెర న‌టుడు నిఖిల్ నిజ స్వరూపం తెలుసుకుని పలు ఇంటర్వ్యూలో అతడి గురించి చెప్పుకొచ్చొచ్చింది. అయితే, ఈ అమ్మ‌డు బిగ్‌బాస్ హోస్‌లో ఉండ‌గానే తన ప్రియుడు యష్ గురించి అంద‌రికీ చెప్పింది. య‌ష్‌కు ఇంత‌కుముందే పెళ్లి అయిందని, తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని.. త్వరలో తామిద్దరం వివాహ బంధంలో అడుగుపెట్ట‌బోతున్నాడ‌ని చెప్పింది.

ఇప్పుడు తాజాగా, నవంబర్ 21వ తేదిన త‌న ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. డిసెంబరు రెండో వారంలో బిగ్‌బాస్ న‌టి పెళ్లి జరిగే అవకాశమున్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌, ఇటీవ‌లే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన సోనియా నామినేష‌న్స్ ప్ర‌క్రియ‌లో భాగంగా నిఖిల్‌ను క‌డిగిన పారేసిన సంగ‌తి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+