రాజా నీ రాణి వచ్చేసింది..బిగ్ బాస్ నుంచి దివ్వెల మాధురి అవుట్
ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ (Bigg Boss 9 Telugu)లో జరిగిన డ్రామా ఎవ్వరూ ఊహించని విధంగా ఉంది. హౌస్‌లోకి ఒక 'నిజమైన ఫైర్ స్ట్రోమ్' లాగా దూసుకొచ్చిన కంటెస్టెంట్ దివ్వెల మాధురి. వచ్చిన రోజు నుంచే అందరితో కటువుగా, ఇష్టం వచ్చినట్లుగా గొడవలు పెట్టుకుని, తాను గేమ్ ఆడడానికే వచ్చాను, బాండింగ్స్ కోసం కాదు అని ప్రకటించింది. ఆమె ఆటిట్యూడ్‌కి హౌస్‌మేట్స్ హడలిపోయారు.
అయితే, అలాంటి మాధురి, టాప్ కంటెస్టెంట్ తనూజతో అకస్మాత్తుగా 'అయస్కాంతంలా' అతికిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తానూజ పదేపదే 'నాకు బాండింగ్ వద్దు' అని మొహం మీదే చెప్పినా కూడా, మాధురి ఆమెను తన సొంత కూతురులా దగ్గరకు తీసుకుంది. హౌస్‌మేట్స్, ఆడియన్స్ దృష్టిలో, దీని వెనుక ఉన్న మాధురి వ్యూహం స్పష్టంగా కనిపించింది: తనూజకు ఉన్న ప్రజాదరణను, ఆమె టాప్ స్థానాన్ని వాడుకుని నామినేషన్ల నుండి సేవ్ అవ్వాలని ప్లాన్ చేసింది.

మాధురి ప్లాన్‌కు పదునుగా తానూజకు సేవింగ్ పవర్ వచ్చినప్పుడే. ఆ పవర్ కోసం ఎంతటి ఆటిట్యూడ్ ఉన్న మాధురి అయినా, తానూజతో గొడవ పడిన వెంటనే వెళ్లి ఆమెకు జడలు వేయడం వంటి పనులు చేసింది. ఇది హౌస్‌లో అందరినీ షాక్‌కు గురి చేసింది. తన ఎలిమినేషన్‌ను తానూజ ఆపుతుందనే ఆశతో మాధురి తన పంతాన్ని దిగమింగింది.
ఈ వారం ఎలిమినేషన్‌లో దివ్వెల మాధురి, గౌరవ్ మధ్య ఉత్కంఠ నెలకొంది. నాగార్జున, తానూజను ఆమెకు లభించిన సేవింగ్ పవర్‌ను ఉపయోగించాలనుకుంటున్నావా అని అడగ్గా, తానూజ ఏమాత్రం ఆలోచించకుండా లేదు సార్ అని సమాధానం ఇచ్చింది. తక్కువ ఓటింగ్ కారణంగా మాధురి ఎలిమినేట్ అయ్యింది, గౌరవ్ సేవ్ అయ్యాడు.
తానూజ తీసుకున్న ఈ నిర్ణయం, ఆమె మాస్టర్ మైండ్ గేమ్‌కు నిదర్శనం. మాధురిని డైరెక్ట్‌గా నామినేట్ చేయడం, ఆపై ఆమె కోసం సేవింగ్ పవర్‌ను వాడకపోవడం చూస్తే, తానూజ కేవలం టాప్ కంటెస్టెంట్ మాత్రమే కాదు, ఆలోచించి ఆడే తెలివైన ప్లేయర్ అని రుజువైంది. ఆశతో దగ్గరైన మాధురి ఆశ తీరకపోగా, తానూజ చేతిలోనే బలైపోవడం ఈ సీజన్‌లోని అతిపెద్ద ట్విస్ట్‌గా మారింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications