బిగ్ బాస్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్..ఎలిమినేట్ అనుకుంటే టాప్‌లోకి దూసుకొచ్చిన కంటెస్టెంట్
బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. కంటెస్టెంట్స్ ఆటతీరుని బట్టి ఓటింగ్ గ్రాఫ్‌లు క్షణాల్లో మారిపోతుంటాయి. ఈ సీజన్‌లో దీనికి బెస్ట్ ఉదాహరణ సుమన్ శెట్టి. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి చాలా సైలెంట్‌గా, అంతగా ఎవరితో కలవకుండా ఉన్న సుమన్ శెట్టి, ఇప్పుడు అనూహ్యంగా టాప్‌లో దూసుకుపోతున్నారు.
మొదట, ఈ వారం నామినేషన్లలోకి వస్తే సుమన్ ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా, సోషల్ మీడియా పోల్స్‌లో సుమన్ శెట్టి ఇప్పుడు ఏకంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఈయనకంటే ముందు తనూజ మొదటి స్థానంలో ఉంది.

సుమన్ శెట్టికి ఊహించని ఓట్లు రావడానికి కారణాలు
సుమన్ శెట్టి ఒకప్పుడు తెలుగులో టాప్ కమెడియన్‌గా ఎంతోమందికి సుపరిచితులు. తెలుగు ప్రేక్షకులతో ఆయనకు ఉన్న బలమైన కనెక్షన్ ఓటింగ్‌లో కనిపిస్తోంది. హౌస్‌లో ఆయన ప్రవర్తన, నిజాయితీ, సింపుల్ స్వభావం ప్రేక్షకులకు బాగా నచ్చింది. వాష్ రూమ్‌లో పిల్లవాడిలా రూమ్ స్ప్రేతో ఆడుకోవడం, టాస్క్‌లలో తనదైన శైలిలో ఫ్లోరా షైనీని ఓడించి సుత్తితో నామినేట్ చేయడం వంటివి ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి.నామినేషన్స్ ప్రక్రియలో సంజన గల్రానికి మౌనంగానే గట్టి కౌంటర్ ఇవ్వడం కూడా ప్రేక్షకులకు నచ్చింది.
ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో ఎవరున్నారు?
సుమన్ శెట్టి గ్రాఫ్ అమాంతం పైకి లేవగా, మరోవైపు హౌస్‌లో మొదటి రోజు నుంచీ అందరికీ చిరాకు తెప్పించిన సంజన గల్రాని ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఊహించిన దానికంటే ఎక్కువ ఓటింగ్‌తో సేఫ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, శ్రేష్టి వర్మ చివరి స్థానంలో ఉంటూ ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో ఉంది. ఆమె తర్వాత స్థానంలో ఫ్లోరా షైనీ ఉంది. మూడో స్థానంలో ఇమ్మానుయేల్ కొనసాగుతున్నాడు. రాబోయే రోజుల్లో ఈ ఓటింగ్ గ్రాఫ్‌లు మళ్లీ మారే అవకాశాలు ఉన్నాయి. అయితే సుమన్ శెట్టి ఇప్పుడు సాధించిన ఈ విజయం మాత్రం బిగ్ బాస్ ఇంట్లో అతని ఆటను పూర్తిగా మార్చేసిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications