'బోర్ కొట్టినప్పుడల్లా పవన్ కల్యాణ్ క్యారవాన్ లోకి పిలిచేవారు!'
వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు అశ్వని. ఫిజికల్ గా, మెంటల్ గా ఎంతో అద్భుతంగా తన ఆట తీరును కనబరుస్తున్నారు. తాజాగా అశ్వనికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికంటే ముందుగా కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన అశ్వని పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు.
ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు. పవన్ కల్యాణ్ సార్ అందరితో చాలా మంచిగా ఉంటారని, అందుకే అందరూ ఆయన్ను దేవుడు అని కొలుస్తారని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం బోర్ కొట్టినా తనను కారవాన్ లోకి పిలిపించుకునే వారన్నారు. అలా తనను పిలిపించుకొని ఒక మంచి పాట పాడమ్మా అంటూ నాతో పాట పాడించుకునేవారని అశ్వని చెప్పారు. ఎక్కువ సమయం తాను పవన్ కళ్యాణ్ సార్ తో కలిసి కారవాన్ లోనే ఉండేదాన్ని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ఫుడ్ తాము కూడా తినేవాళ్ళం అని తెలిపారు.

ఒకసారి తాను కారులోనే ఉండిపోయానని, ఆడెవడన్న ఈడెవడన్న అనే పాటను దాదాపు 800 మందితో కలిసి షూట్ చేస్తున్నారని చెప్పారు. తనకోసం అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఆలస్యంగా వెళ్లానని, పవన్ కళ్యాణ్ గారితో తనకు తిట్లు తప్పవని భయపడినట్లు చెప్పారు. కానీ ఆయన మాత్రం నువ్వేమీ కంగారు పడకు చిల్ అవ్వు అంటూ తనని ఒక్క మాట కూడా అనలేదని సంతోషంగా చెప్పారు. ప్రస్తుతం అశ్వని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications