హీరో నవదీప్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి..!
తేజస్వీ మాదివాడ.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో గెస్ట్ రోల్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఈ అమ్మడు.. ప్రేక్షకులకు మరింత చేరువైంది. మనం, హార్ట్ ఎటాక్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఐస్‌క్రీం వంటి చిత్రాలతో ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత నుంచి సినిమాల్లో తక్కువగానే కనిపిస్తుంది. కానీ బుల్లితెరపై మాత్రం సందడి చేస్తూ పలు కార్యక్రమాల్లో కనిపిస్తుంది. అయితే తేజస్వి గత కొన్ని రోజులుగా హీరో నవదీప్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఈ అంశంపైనే ఆమె పోస్టులకు కామెంట్స్ పెడుతున్నారు.

ఇక రీసెంట్ గానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. ఈ వార్తలపై రియాక్ట్ అయ్యింది. తనదైన శైలిలో స్పందిస్తూ హీరోతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. దీంతో తేజస్వి చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంటర్వ్యూలో తేజస్వీ మాట్లాడుతూ.. తన జీవితం తెరిచిన పుస్తకమని.. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశానంటూ చెప్పుకొచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ ను కూడా కోల్పోయానని స్పష్టం చేసింది.
అంతే కాకుండా నవదీప్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే.. కానీ చాలా మంది నవదీప్ తో పెళ్లి ఎప్పుడు అని సోషల్ మీడియాలో అడుగుతూ ఉంటారని వ్యాఖ్యానించింది. క్లోజ్ గా ఉంటే పెళ్లి చేసుకోవాల అంటూ ప్రశ్నించింది. దీంతో ఈమె పెళ్లి వార్తలకు ఇప్పటితో ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు. మరోవైపు నవదీప్ కూడా పలు కార్యక్రమాల్లో తన రిలేషన్ షిప్ గురించి, పెళ్లి గురించి ఓపెన్ గానే స్పందించారు.












Click it and Unblock the Notifications