ఇంట్లో అమ్మాయిని అక్రమంగా పెట్టుకుందని నటి అరెస్టు, సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ !
బిగ్ బాస్ కన్నడ ఫేమ్, సోషల్ మీడియా స్టార్ అయిన సోనూ శ్రీనివాస్ గౌడ్ అలియాస్ అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో సందడి చేసి బిగ్ బాస్ కన్నడలో చాన్స్ కొట్టేసిన సోనూకు ఇప్పుడు సినిమా కష్టాలు మొదలైనాయి. బిగ్ బాస్ కన్నడ సీజన్ ద్వారా మరింత ఫేమస్ అయిన సోనూ శ్రీనివాస్ గౌడ అరెస్ట్ కావడంతో ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
సోనూ శ్రీనివాస్ గౌడ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ కారణం ఏమిటా ? ఆరా తీస్తే ఒక్క క్షణం అందరూ షాక్ అయ్యారు. కానీ ఇది నిజం అని పోలీసు అధికారులు అంటున్నారు. సోనూ గౌడ సేవంతి అనే 8 ఏళ్ల నిరుపేద బాలికను దత్తత తీసుకున్న సంగతి కన్నడిగులకు తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను నటి సోనూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఇదే విషయం సోనూకు కొరకరాని కొయ్యగా మారింది.

బాలికను దత్తత తీసుకున్న నటి సోనూ కటకటాల వెనక్కి వెళ్లింది. ఉత్తర కర్ణాటకకు చెందిన సేవంతి అనే 8 ఏళ్ల బాలికను నటి సోనూ శ్రీనివాస్ గౌడ దత్తత తీసుకున్నారు. అయితే నటి సోనూ బిడ్డను అక్రమంగా దత్తత తీసుకున్నట్లు బెంగళూరులోని బ్యాడరహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. సోనూ గౌడపై శిశు సంక్షేమ శాఖ ఫిర్యాదు చేసింది. అధికారులు ఫిర్యాదు చెయ్యడంతో సోనూను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.
బ్యాడరహళ్లి పోలీసులు సోనూ శ్రీనివాస్ గౌడ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. చిన్నారిని దత్తత తీసుకున్నట్లు నటి సోనూ సోషల్ మీడియాలో ఆ చిన్నారి ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. ఎనిమిదేళ్ల చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకున్నారని సోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నది. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర బాలల సంరక్షణ విభాగం అధికారిణి గీతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దత్తత తీసుకున్న ఆడపిల్లను నటి సోనూ ప్రచారం కోసం ఉపయోగించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. పేదలకు సహాయం చేస్తున్నట్లు నటించిన బిగ్ బాస్ ఫేమ్ పెద్ద సెలబ్రిటీ అయిపోవాలని అనుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇతరుల పిల్లల సమాచారాన్ని పబ్లిక్‌గా షేర్ చేసిందని సోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నది. సోనూ బాలికను దత్తతకు అనుసరించాల్సిన చట్టపరమైన విధానాలు కూడా సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణ కూడా ఉంది. ప్రస్తుతం పోలీసులు నటి సోనూను విచారిస్తున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications