మూడు సినిమాల్లో హీరోగా ఛాన్సు కొట్టేసిన బిగ్‌బాస్ గౌతమ్...
బిగ్ బాస్ 7 షో నిన్నటితో పూర్తయ్యింది. తెలుగులో టాప్ రియాలిటీ షో గా పేరు తెచ్చుకున్న బిగ్‌బాస్ షో నిన్నటితో ముగిసింది. ఆదివారం ప్రసారమయిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ సెలబ్రిటీల సందడితో మారుమోగింది. రైతుబిడ్డగా అందరి మనుసుల్లో స్థానాన్ని సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచి ట్రోపీని దక్కించుకున్నాడు. రన్నర్‌గా టివీ సీరియల్ నటుడు అమర్‌దీప్ నిలిచాడు. ఇక, ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు డ్యాన్సులతో అదరగొట్టేసారు. హౌస్ లో ఉన్న ఆరుగురు ఫైనలిస్ట్స్ కూడా ఒక్కొక్కరు తమ ప్రదర్శనతో అదరగొట్టేసారు.
అమ్మకు రిటైర్మెంట్ ముందే ఇప్పించిన గౌతమ్ : ఇక, ఇదిలా ఉంటే హౌస్ నుంచి బయటికి వెళ్లిన కంటెస్టెంట్లకు సినిమా ఆఫర్లు వస్తోన్నట్లు తెలుస్తోంది. హౌస్‌లో డాక్టర్ బాబుగా పరిచయమైన గౌతమ్ మూడు సినిమా ఆఫర్లు అందుకున్నట్లు సమాచారం. గ్రాండ్ ఫినాలేకు వచ్చిన గౌతమ్‌ను కొందరు మీడియా వారు మాట్లాడగా.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మూడు సినిమాలకు హీరోగా సైన్ కూడా చేశాను. మా అమ్మకు రిటైర్మెంట్ ముందే ఇప్పిస్తున్నాను. రిటైర్మెంట్ అంటే సెటిల్ కాలేదనే భయం ఉండేది. ఇప్పుడదేమీ లేదు. అంటూ ఎంతో సంతోషంగా జవాబిచ్చాడు. సినిమాల్లోకి రావాలనే తన కోరిక బిగ్‌బాస్‌తో నేరవేరిందని ఆనందం వ్యక్తం చేశాడు.

భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న సభ్యులు :బిగ్‌బాస్‌లోని మిగిలిన సభ్యులు కూడా భారీ రెమ్యూనరేషనే తీసుకున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ అందరిలో కన్నా నటుడు శివాజీ భారీ మొత్తంలో వసూలు చేసినట్లు సమాచారం. వారానికి ఏకంగా 4.5 లక్షలను తీసుకున్నట్లు టాక్. ఇక, రన్నర్ గా నిలిచిన అమర్‌దీప్‌కూడా తక్కువేమీ తీసుకోలేదు. రూ. 37 లక్షలు సంపాదించినట్లు సమాచారం. విన్నర్ రైతుబిడ్డ కూడా రూ.50 లక్షలతో పాటు ఒక కారును కూడా సొంతం చేసుకున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో అర్జున్ ఎలిమినేట్ కాగా, ప్రియాంక, యావర్, శివాజి, అమర్‌దీప్, ప్రశాంత్ టాప్ ఫైవ్‌లో నిలిచారు. ఇక, శివాజీ మూడో స్థానంలో ఇంటి నుంచి బయటికి వచ్చేసాడు.












Click it and Unblock the Notifications