బిగ్‌బాస్ శివాజీ చెల్లి వరుస అయ్యే అమ్మాయిని లేపుకెళ్లాడా..?
బిగ్‌బాస్ 7 సీజన్ అంచనాలు తగ్గట్టుగానే సాగుతుంది. ఉల్టా పల్టా అంటూ చెప్పి.. షోను గత సీజన్లకు భిన్నంగా చూపించడంలో బిగ్‌బాస్ యాజమాన్యం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ సీజన్ విన్నర్ ఎవరనే విషయంలో ఇద్దరి ఆటగాళ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు రైతు బిడ్డ ప్రశాంత్ కాగ, రెండోది నటుడు శివాజీ. చేతికి గాయం అయినప్పటికీ శివాజీ ఆడుతున్న గేమ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఇదిలా ఉంటే శివాజీకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శివాజీ గతంలో తనకు వరసకు చెల్లెలు అయ్యే అమ్మాయిని లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడనేది ఈ వార్త సారాంశం. నటుడుగా శివాజీకి అవకాశాలు తగ్గిన తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారాయన. పలు రాజకీయ పార్టీలకు మద్దతుగా నిలిచారు.

ఆ సమయంలో ఓ టీవీ ఛానెల్ లైవ్ ప్రొగ్రామ్‌లో పాల్గొన్న శివాజీని ..ఓ ప్రవాసాంద్రుడు మాట్లాడుతూ.. దయచేసి శివాజీలాంటి వ్యక్తులను ఇలా చర్చకు పిలవకండీ ..ఆయన చెల్లి వరుస అయ్యే అమ్మాయిని లేపుకెళ్లాడని ఆ ప్రవాసాంద్రుడు లైవ్ ప్రొగ్రామ్‌లో చెప్పడం జరిగింది. ఊహించని పరిణామంతో కంగుతిన్న శివాజీ.. సదరు వ్యక్తిపై అసభ్య పదజాలంతో మండిపడ్డారు. ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు ఆ ఘటనను కొందరు తెర మీదకు తీసుకువస్తున్నారు.
దీనిపై శివాజీ సన్నిహితులు క్లారిటీ ఇస్తున్నారు. శివాజీ అలాంటి వ్యక్తి కాదని.. అసలు ఈ వార్త ఎక్కడ నుంచి తెలియడం లేదని వారు చెబుతున్నారు. తెలంగాణ అమ్మాయిని శివాజీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని.. రూపాయి కట్నం కూడా తీసుకోలేదని.. మరి అలాంటప్పుడు చెల్లి వరుస అమ్మాయిని ఎలా లేపుకెళ్తాడని శివాజీ సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. శివాజీ బిగ్‌బాస్ విన్నర్ కాకూడదనే ఇలాంటి రూమర్స్‌ను ప్రచారం చేస్తున్నారని వారు అంటున్నారు. మరి దీనిపై శివాజీ కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications