నాగార్జున వచ్చి క్షమాపణలు చెప్పాలా...? గుండు అంకుల్ ఏంటిది

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ప్రవర్తన ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది. మొదటి వారం నుంచే తన వింత చేష్టలతో, అర్థం లేని అహంకారంతో ప్రేక్షకులను, హౌస్‌మేట్స్‌ను విసిగిస్తున్నాడు. నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో అతడి తప్పులను చూపించి, మార్చుకోమని చెప్పినా, హరీష్ అందుకు ఒప్పుకోవడం లేదు. తనని బిగ్‌బాస్ టీమ్ కావాలనే నెగిటివ్‌గా చూపిస్తోందని భావించి, ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిరాహార దీక్షకు దిగాడు.

తాజాగా విడుదలైన ప్రోమోలో, శ్రీజ అతడి కోసం అన్నం తీసుకువస్తే, నేను ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లేంత వరకు అన్నం, నీళ్లు ముట్టను. మీలాంటి వాళ్లు ఉన్న చోట నేను అన్నం తినను అంటూ అవమానకరంగా మాట్లాడాడు. ఒకరు మర్యాదగా భోజనం తీసుకొస్తే, అంతటి అవమానకరంగా మాట్లాడటం మాస్క్ మ్యాన్‌కే చెల్లిందని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. హరీష్ ప్రవర్తనను చూసి, "అసలు ఇతను సమాజంలో ఎలా బ్రతుకుతున్నాడు?" అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss Telugu 9 Mask Man Haritha Harish s Arrogance Puts Audience Patience to the Test

గతంలో సంజన చేసిన ఒక చిన్న తప్పుకు, ఆమెను క్రిమినల్‌లా చూపించే ప్రయత్నం చేసి, "మీరు బ్యాగ్‌లు ప్యాక్ చేసుకోండి, హ్యాపీ జర్నీ" అంటూ ఆమెను అవమానించాడు. అదే మాట హరీష్‌ను ఎవరైనా అంటే, హౌస్‌ని తలకిందులు చేసేవాడని జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడు నాగార్జున చేసిన తప్పులను చూపించి, మార్చుకోమంటే "నేను బయటకు వెళ్తాను" అనడం చూస్తుంటే, అతన్ని హౌస్‌లో ఉంచడానికి నాగార్జున వచ్చి క్షమాపణలు చెప్పాలా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈ స్థాయి అహంకారం, అవమానకర ప్రవర్తన ఉన్న వ్యక్తిని మళ్లీ బిగ్‌బాస్‌లో చూడలేమని నెటిజన్లు అంటున్నారు. హరీష్ వ్యవహారంతో బిగ్‌బాస్ షో మరింత ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+