Bigg Boss 9 : ఆ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయడానికి హౌస్‌మెట్స్ ప్లాన్
బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న బిగ్‌బాస్ తెలుగు 9 షో రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారం ఊహించని విధంగా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఇప్పుడు 14 మంది కంటెస్టెంట్లు మిగిలారు. ఈ నేపథ్యంలో రెండో వారం నామినేషన్లు మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మొదటి వారం కామనర్స్, సెలబ్రిటీల మధ్య నెలకొన్న విభేదాలు ఈ వారం రివెంజ్ నామినేషన్స్‌కు దారితీసే అవకాశం కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, ఈ వారం నామినేషన్స్‌లో చాలా మంది కంటెస్టెంట్లకు మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ప్రధాన టార్గెట్‌గా మారినట్టు తెలుస్తోంది. మొదటి వారంలోనే తన విచిత్రమైన ప్రవర్తన, మాట తీరుతో హరిత హరీష్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. "రెడ్ ఫ్లవర్", "ఆడింగోళ్లు" వంటి పదాల వాడకం హౌస్‌మేట్స్‌ను కలవరపరిచింది. దీంతో సహజంగానే హౌస్‌లో చాలా మంది అతని పేరు నామినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

ఈ వారం నామినేషన్ ప్రక్రియలో మర్యాద మనీష్, హరిత హరీష్, తనూజ పుట్టస్వామి, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, భరణి శంకర్, ఆశా షైనీ నామినేట్ అయినట్టు లీక్‌లు చెబుతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ సెలబ్రిటీలు ఉండటం ఆసక్తికరంగా మారింది. గత వారం నామినేషన్స్ తర్వాత సెలబ్రిటీలు, కామనర్స్ మధ్య పెరిగిన దూరం ఈ వారం నామినేషన్స్‌లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
బిగ్ బాస్ ప్రేక్షకులకు అత్యంత ఆసక్తికరమైన భాగం నామినేషన్స్. హౌస్‌మేట్స్ మధ్య వ్యక్తిగత గొడవలు, పాత మనస్పర్థలు ఈ ప్రక్రియలో బయటపడతాయి. ఈ వారం ఎవరు హౌస్‌లో ఉంటారు, ఎవరు బయటకు వెళ్తారనేది మరింత ఉత్కంఠను పెంచుతోంది. అధికారిక ఎపిసోడ్ ప్రసారమైతేనే ఈ నామినేషన్ల పూర్తి వివరాలు తెలుస్తాయి. అయితే, హరిత హరీష్‌పై మాత్రం ఈ వారం అందరి దృష్టి కేంద్రీకృతమైంది.












Click it and Unblock the Notifications