నిన్ను బిగ్ బాస్‌కు పంపించే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదు..!

సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోంది బిగ్‌బాస్ షో . కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది. షో మొదట్లో సెలబ్రిటీలను మాత్రమే తీసుకురాగా తర్వాత సామాన్యులను, పెళ్లైనా జంటలను కూడా షోకు తీసుకురావడం మొదలుపెట్టారు. తెలుగులో ద్విగిజయంగా ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్, మరో సీజన్‌కు రెడీ అవుతోంది.

సీజన్‌ కోసం అన్నపూర్ణ స్టూడియోలో వేస్తున్న భారీ సెట్‌ కూడా పూర్తి కావొచ్చింది. ఈ సీజన్‌లో హోస్ట్‌‌‌ను మారుస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ , 9వ సీజన్‌లో కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గత మూడు 'బిగ్ బాస్' సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఫెయిల్ అయ్యాయి. హౌస్‌లోకి వచ్చిన ఆర్టిస్టులు పెద్దగా ఫేమస్ కాకపోవడం..'బిగ్‌ బాస్' ఆడించే గేమ్స్ ఆసక్తికరంగా లేకపోవడం ఇలా అన్ని కలిసి.. 'బిగ్‌ బాస్' షో ప్లాప్‌ అయ్యేలా చేశాయి. దీంతో టీఆర్పీ రేటింగ్స్‌ సైతం భారీగా పడిపోవడంతో.. షో యాజమాన్యం .. 9వ సీజన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. దీనిలో భాగంగానే పలువురు సెలబ్రిటీలను షోకు తీసుకువచ్చేలా షో యాజమాన్యం ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకూ విడుదలైన ప్రోమోలు షోపై అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి.

Bigg Boss Telugu Season 9 Is Ramya Moksha Entering the House Contestants List Rumors

ఈ సీజన్‌లో కంటెస్టెంట్లను రెండు హౌస్‌లను ఉంచే యోచనలో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. సాధారణంగానే బిగ్ బాస్ అంటే ఒక ఉత్కంఠ, ఎన్నో మలుపులు, అనూహ్య ఘటనలు. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక లిస్ట్ ఈ సీజన్‌పై అంచనాలను రెట్టింపు చేస్తోంది.ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న సెలబ్రిటీలంటూ కొన్ని పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. వాటిలో సినిమా తారలు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, కమెడియన్లు ఉన్నట్లు సమాచారం.

ఈ సీజన్ ఎవరొచ్చిన రాకపోయినా, అలేఖ్య చిట్టి పికిల్స్‌తో ఫుల్ పాపులర్ అయిన రమ్య మోక్ష మాత్రం రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్‌ వివాద సమయంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న రమ్య మోక్ష, వాటిని తట్టుకుని బలంగా నిలబడింది. ఇదే సమయంలో ఆమె గ్లామర్‌తో కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇవేమి కాకుండానే ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న వీడియోలు, ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో బిగ్ బాస్‌కు కావాల్సిన గేమ్స్‌కు రమ్య మోక్ష సెట్ అవుతుందనే అభిప్రాయం అభిమానుల్లో బలంగా ఉంది. దీంతో ఈ సీజన్‌లో రమ్య మోక్షను చూడాటానికి తహతహలాడుతున్నారు. మరి బిగ్ బాస్ యాజమాన్యం రమ్య మోక్షకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. అభిమానులు కోరుకున్నట్టు రమ్య మోక్ష బిగ్ బాస్‌లో అడుగుపెడితే సంచలనాలు సృష్టించడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+