బిగ్ బాస్ సీజన్-9 ప్రోమో ఔట్.. " డబుల్ హౌస్.. డబుల్ డోస్ " !
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్‌బాస్' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా ఎనిమిది సీజన్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత.. ఇప్పుడు ఈ షో 9వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొత్త కాన్సెప్, రెట్టింపు వినోదంతో రాబోతోన్న ఈ సీజన్ లో కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ సీజన్‌కు 'డబుల్ హౌస్.. డబుల్ డోస్' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు.
కామన్ మ్యాన్ కేటగిరీలో కంటెస్టెంట్స్ ఎంపిక కోసం 'అగ్నిపరీక్ష' అనే కొత్త ప్రాసెస్‌ను ప్రారంభించారు. దాదాపు 40 మంది ఫైనల్ లిస్టులో ఉండగా, ఈ పరీక్షలో గెలిచినవారే బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం పొందనున్నారు. లేటెస్ట్ గానే ఈ సీజన్ ప్రోమోను రిలీజ్ చేశారు. అందులో మాట్లాడుతూ.. నాగార్జున, "ఈ సారి రణరంగమే" అంటూ అంచనాలు మరింత పెంచేశారు.

బిగ్‌బాస్‌నే మార్చేశా..?
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున, టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిశోర్‌తో చేసిన సరదా సంభాషణ హైలైట్‌గా నిలిచింది. "బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి వచ్చావా?" అని నాగార్జున అడగ్గా, "కాదు, ఏలడానికి వచ్చాను" అంటూ వెన్నెల కిశోర్ సమాధానమిచ్చాడు. దానికి నాగార్జున, "అది నీవల్ల కాదులే... ఈసారి వెరీ టఫ్" అని చెప్పగా, వెంటనే కిశోర్, "నేను చాలా రఫ్" అంటూ జవాబిచ్చాడు.
అలానే "ఎప్పుడైనా పాత సిలబస్‌తో కొత్త ఎగ్జామ్ రాస్తావా?" అంటూ నాగార్జున ప్రశ్నించగా, కిశోర్, "నేను డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌తోనే మాట్లాడుకుంటాను" అని అన్నాడు. దీనికి నాగార్జున, "ఈసారి బిగ్‌బాస్‌నే మార్చేశా" అంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. దీని వలన ఈ సీజన్‌లో పాత బిగ్‌బాస్ ఉంటాడా? లేక నిజంగానే కొత్త బాస్ వస్తాడా? అన్న ఉత్కంఠ పెరిగింది.
Double House, Double Dose! 👑🔥 Mugimpu varaku prathi kshanam oka yuddhame, andhari saradhaalu theeripothayi 👁️💥
— Starmaa (@StarMaa) August 10, 2025
Biggest Battle of the Year #BiggBossSeason9ComingSoon On #StarMaa 💥#BiggBossTelugu #BiggBossTelugu9 pic.twitter.com/4AXMR9QWVh
ఈ సీజన్‌లో 'డబుల్ హౌస్' అనే వినూత్న కాన్సెప్ట్‌తో పాటు, కేవలం సెలబ్రిటీలకే కాకుండా సామాన్యులకు కూడా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఈ మార్పులు, కొత్త రూల్స్, అనుకోని ట్విస్ట్‌లతో షో మరింత ఉత్కంఠభరితంగా, వినోదభరితంగా సాగనుందని బిగ్‌బాస్ టీమ్ చెబుతోంది. త్వరలోనే ఈ సీజన్ ప్రసార తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తం మీద ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 9 - పాత సిలబస్ కాదని, కొత్త ఎగ్జామ్‌తో వస్తోందని, రణరంగం లాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని నాగార్జున హామీ ఇస్తున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా!












Click it and Unblock the Notifications