ఇండియాలోనే అతి పెద్ద ఫ్లాప్ సినిమా ఇదే..!

ఇటీవల కాలంలో సినిమా స్థాయి పెరిగింది. ఇండియన్ సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కంటెంట్ లేకపోయినప్పటికీ భారీగా నిర్మించి చేతులు కాల్చుకుంటున్నారు.భారీ బడ్జెట్‌తో నిర్మించబడి, అంచనాలకు తగ్గకుండా వసూళ్లు చేయలేకపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు 2' సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే, అంచనాలకు తగ్గకుండా వసూళ్లు చేయలేకపోయింది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన 'కంగువా' సినిమా కూడా భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. అయితే, బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'బడే మియా చోటే మియా' సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది. అయితే గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఔరోన్ మే కహన్ దమ్ థా' ఇండియాలోనే అతి పెద్ద ఫ్లాప్ సినిమాగా నిలిచింది. అజయ్ దేవగన్, టబు వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించారు. ఈ చిత్రం ఒక కుటుంబ నాటకంగా ప్రారంభమై, ఆ తర్వాత ఒక రొమాంటిక్ థ్రిల్లర్‌గా మారుతుంది.

biggest flop movie in India

కథలో ప్రధానంగా ఒక కుటుంబం ఎదుర్కొనే సమస్యలు, వారి మధ్య సంబంధాలు, మరియు ఒక ప్రేమ కథ కేంద్రంగా సినిమా కథ సాగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.12.91 కోట్లు మాత్రమే రాబట్టింది. దీంతో ప్రొడ్యూసర్‌లు, డిస్ట్రిబ్యూటర్‌లకు తీవ్ర నష్టాల పాలయ్యారు.విచిత్రం ఏమిటంటే బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచిని 'ఔరోన్ మే కహన్ దమ్ థా' సినిమా , ఓటీటీలో మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+