Daaku Maharaj- పురందేశ్వరి మ్యాట్నీ షో: సినిమాపై ఇంట్రెస్టింగ్ రివ్యూ

Daaku Maharaj: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు, లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. బాపట్ల జిల్లా చీరాలలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగ వేడుకలను జరుపుకొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు.

మకరరాశిలోకి సూర్యుడు పయనించే సంక్రమణ కాలం రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానని పురందేశ్వరి అన్నారు. ప్రకృతితో ముడిపడి ఉన్న భారతీయ పండుగలన్నిటిలో తెలుగువారికి ముఖ్యమైన సంక్రాంతి పండుగగా అభివర్ణించారు. భోగితో భోగభాగ్యాలు, సంక్రాంతితో ఆనందాలు, కనుమతో కొత్త సంతోషాలు- ప్రతి ఇంటా నిండాలని ఆకాంక్షించారు.

BJP MP Purandeswari watched Nandamuri Balakrishna s Daaku Maharaj movie at Chirala

ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి డాకు మహారాజ్ సినిమాను చూశారు. భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి చీరాలలోని మోహన్ థియేటర్‌లో ఈ సినిమాను చూశారామె. అనంతరం సినిమా గురించి మాట్లాడారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు.

డాకు మహారాజ్ ఓ మంచి సందేశాత్మక చిత్రమని పురందేశ్వరి ప్రశంసించారు. ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటారని, సేవలను అందించిన వ్యక్తి చరిత్రలో నిలిచిపోతారనే సందేశాన్ని ఈ సినిమా ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజా సేవే పరమావధిగా ముందుకు వెళ్లినట్లయితే ప్రజలు ఏ విధంగా పూజిస్తారో ఈ సినిమా తెలియజేస్తుందని చెప్పారు.

ఈ సినిమాలో బాలకృష్ణ నటన మరింత ఉన్నతంగా ఉందని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆయన నటన గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదని, నట సింహం అనే బిరుదును ప్రజలే ఇచ్చారని గుర్తు చేశారు. బాలకృష్ణ నట విశ్వరూపం ఈ సినిమాతో మరోసారి ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. మంచి సినిమాను తీశారంటూ దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలిపారు.

బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహరాజ్. ఈ నెల 12వ తేదీన విడుదలైంది. బాబీ కొల్లి దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవితో తీసిన వాల్తేరు వీరయ్య తరువాత ఆయన దర్శకత్వంలో రాబోతోన్న మూవీ ఇదే కావడం, దీని టైటిల్, బాలయ్య గెటప్ కొత్తగా ఉండటం సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దీనికి అనుగుణంగా హిట్ టాక్ కొట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+