బాలీవుడ్ న‌టుడు గోవింద కాలిలోకి దూసుకుపోయిన బుల్లెట్...ఆసుప‌త్రిలో చికిత్స‌..

ప్ర‌ముఖ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు గోవిందకు బుల్లెట్ గాయాల‌య్యాయి. దీంతో హుటాహుటినా ఆయ‌న‌ను ముంబైలోని ప్ర‌ముఖ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం ముంబైలోని గోవింద నివాసంలోనే చోటుచేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

బాలీవుడ్ న‌టుడు గోవింద ముంబైలోని త‌న నివాసం నుంచి కోల్‌క‌త్తాకు వెళ్లేందుకు బ‌య‌లుదేరారు. ఈ సమ‌యంలో త‌న లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ను తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దానిని అందుకుని బ‌య‌టికి వ‌స్తున్న స‌మ‌యంలో ప్ర‌మాద‌వశాత్తు అది చేయి జారి కిందపడింది. దీంతో ఒక్క‌సారిగా రివాల్వ‌ర్ నుంచి దూసుకొచ్చిన తూటా గోవింద కాలిని తాకింది. ద‌గ్గ‌ర‌గా బుల్లెట్ కాలిని తాక‌డంతో తీవ్ర గాయమ‌యిన‌ట్లు తెలుస్తోంది.

Bollywood actor Govinda s leg was hit by a bullet he is being treated in the hospital

90 వ ద‌శ‌కంలో అగ్ర‌హీరోగా..

ప్ర‌మాదాన్ని గ‌మ‌నించిన కుటుంబ‌స‌భ్యులు హుటాహుటినా ఆయ‌న్ను ముంబైలోని ఓ ప్ర‌యివేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.వెంటనే వైద్యులు శ‌స్త్ర‌చికిత్స ద్వారా కాలి నుండి బుల్లెట్‌ను తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని, కొన్నిరోజులు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంద‌ని ఆయ‌న మేనేజర్ వెల్ల‌డించారు.

త‌మ అభిమాని న‌టుడు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న అభిమానులు సోష‌ల్‌మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. 90వ ద‌శ‌కంలో బాలీవుడ్ అగ్ర‌హీరోగా పేరుగాంచిన గోవిందా పలు చిత్రాలు చేసి ప్రేక్షకుల‌ను మెప్పించారు. మణిరత్నం దర్శకత్వంలో 2010లో వచ్చిన రావణ్ సినిమా ద్వారా ఇటు తెలుగు ప్రేక్షకులకు గోవింద ద‌గ్గ‌ర‌య్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+