33 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి నేషనల్ అవార్డ్.. ఫుల్ ఖుషి అవుతున్న స్టార్ హీరో..!
బాలీవుడ్ బాద్ షా.. కింగ్ ఖాన్ "షారుఖ్ ఖాన్"కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం హిందీలోనే కాకుండా సౌత్ లో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. విదేశాల్లో సైతం షారుఖ్ మూవీకి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో అందరికి తెలిసిందే. ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు ఈ స్టార్ హీరో.
ఫిల్మ్ కెరీర్..
షారుఖ్.. 1992లో వచ్చిన 'దీవానా' అనే సినిమాతో కెరీర్ ను ప్రారంభించారు. 100కు పైగా చిత్రాలలో నటించిన ఆయన.. రీసెంట్ గానే పఠాన్, జవాన్ చిత్రాలతో భారీ హిట్స్ అందుకోగా.. డంకీ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.

33 ఏళ్ల కల..
కాగా తన సినిమా కెరీర్ లో 14 ఫిలింఫేర్ అవార్డులతో పాటు అనేక ప్రశంసలు అందుకున్నారు. అటు పద్మశ్రీ , ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్, లెజియన్ ఆఫ్ ఆనర్ వంటి అవార్డులు కూడా అందుకున్నారు. అయితే లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వం 71వ నేషనల్ అవార్డ్స్ జాబితాను ప్రకటించింది. 2023 ఏడాది గాను జాతీయ ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ అవార్డు సొంతం చేసుకున్నారు. 'జవాన్' సినిమాకి గానూ షారుక్.. బెస్ట్ యాక్టర్ గా అవార్డు గెలుచుకున్నారు.
ఈ క్రమంలోనే తన 33 ఏళ్ల సినీ కెరియర్ లో తొలిసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు సినీ సెలెబ్రిటీలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుత సినిమాలు..
షారుఖ్ ఖాన్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్‌పై దృష్టి సారించారు. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో మరో యాక్షన్ డ్రామాలో నటించనున్నారని సమాచారం. అలాగే, రాజ్‌కుమార్ హిరానీతో 'డంకీ 2'పై చర్చలు కొనసాగుతున్నాయి. అతడే కాదు, ఓ సౌత్ దర్శకుడితో పాన్ ఇండియా మూవీకి సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టులపై అధికారిక ప్రకటనలు త్వరలో వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications