ఒక్క మెసెజ్‌తో రూమర్స్‌కు చెక్ పెట్టేసిన బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్..
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఈ నటి తనపై వస్తున్నరూమర్స్‌కు ఒక్క మేసేజ్‌తో చెక్ పెట్టేసింది. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న తన 82వ పుట్టిన రోజును ఎంతో వైభవంగా నిర్వహించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన పుట్టినరోజున ఎప్పటిలానే పలువురు అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకు స్పెషల్‌గా విష్ చేశారు. ప్రత్యేకంగా తెలిపిన ఈ శుభాకాంక్షల్లో బిగ్‌బి కోడలు, నటి ఐశ్వర్యరాయ్ పెట్టిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐశ్వర్య పెట్టిన ఈ మెసెజ్‌తో గత కొన్నిరోజులుగా వస్తున్న రూమర్స్‌కు కూడా చెక్‌పడింది.
గత కొంతకాలంగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలొనే ఆమె బిగ్‌బి కుటుంబం నుంచి కూడా వేరు కాబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఐశ్వర్య పెట్టిన ఓ మెసెజ్‌తో ఈ వార్తలకు బ్రేక్ పడింది. నిన్న (అక్టోబర్ 11) అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చాలామంది ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ, కోడలు ఐశ్వర్య నుండి ఎలాంటి మెసేజ్ రాలేదు. దాంతో ఈ వార్తలు నిజమేనని చాలామంది అనుకున్నారు. కానీ, ఆ వార్తలన్నింటికి ఒక్క పోస్ట్‌తో ఐశ్వర్య చెక్‌పెట్టేసింది. ఐశ్వర్య నిన్న రాత్రి ఆలస్యంగా 11.30 కు బిగ్‌బికి స్పెషల్ విషెష్ చెప్పారు. ఈ సందర్భంగా కూతురు ఆరాధ్యతో అమితాబ్ దిగిన ఓ పాత ఫోటోను కూడా షేర్ చేసుకున్నారు.

పండగ చేసుకుంటున్న అభిమానులు..
"పుట్టినరోజు శుభాకాంక్షలు దాదాజీ, ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను" అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌తో ఆవార్తలకు చెక్‌పడింది. ఐదు నెలల తర్వాత ఐశ్వర్య సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఐశ్వర్యా గత ఐదు నెలలుగా యాక్టివ్గా కనిపించడం లేదు. ఐదు నెలల నుంచి ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. మే నెలలో తాను మళ్లీ మేకప్ వేసుకుంటున్నట్లు ఫొటోలను షేర్ చేసింది.
ఆ తర్వాత ఆమె సైలెంట్ అయిపోయింది. అప్పటినుంచి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత బిగ్‌బిని ఉద్దేశించి ఆమె పోస్ట్ పెట్టడం జరిగింది. దాంతో బిగ్‌బి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక, చాలామంది ఐశ్వర్య పెట్టిన పోస్ట్‌కు కామెంట్లు కూడా చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మీ పోస్ట్ మళ్లీ చూసినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఒకరు కామెంట్ పెట్టారు. మరొకరేమో 'మీపై వస్తున్న రూమర్స్‌కు ఒక్కపోస్ట్‌తో చెక్ పెట్టారు' అని రాసుకొచ్చారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications