అత్త అయిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్..
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పేరు తెలియని వారుండరు. బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌లోనూ ప్రభాస సరసన ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తాజాగా మరోసారి చంద్రముఖి 2 సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు కంగనా. అయితే, కంగనా రనౌత్ ఇప్పుడు అత్తగా మారారు. కంగనా రనౌత్ సోదరుడు అక్షత్ రనౌత్ భార్య రీతూ రనౌత్ ఇటీవల ఓ పండంటి బాబుకి జన్మనిచ్చారు. సో.. ఇక.. కంగనా రనౌత్‌కి అత్త పోస్టు వచ్చింది. ఈ సంతోషాన్ని తన అభిమానులతో పంచుకున్నారు కంగనా.
అశ్వత్థామ అనే పేరు : ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు కంగనా. తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. తన మేనల్లుడిని ఎత్తుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ బాబు ఫోటోలు, ఆ బాబుని కంగనా రనౌత్ ఎత్తుకున్న ఫోటోలు, కంగనా తల్లి, సోదరుడు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. నా సోదరుడు, అతని భార్య తల్లితండ్రులుగా మారారు. చక్కని బాబుకి జన్మనిచ్చారు. ఆ బాబుకి అశ్వత్థామ అనే పేరు పెట్టాం. బాబుని, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని సోషల్‌మీడియాలో తన ఖాతాలో పోస్ట్ చేసింది కంగనా రనౌత్..

దర్శకత్వం వహించిన సినిమా : దీంతో కంగనా తన మేనల్లుడిని ఆప్యాయంగా ఎత్తుకున్న ఫోటోలు కాస్తా ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక పలువురు అభిమానులు, నెటిజన్లు, ప్రముఖులు కంగనా సోదరుడు, అతని భార్యకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కంగనా రనౌత్ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే బాలీవుడ్‌లో జరిగిన ఈడీ దాడులపై కూడా ఆమె స్పందించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ మాఫియాపై రెగ్యులర్ గా కౌంటర్లు వేస్తూ ఎప్పడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. బాలీవుడ్‌లో ఫ్యాషన్, క్వీన్ వంటి చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు కంగనా. కంగనా రనౌత్ తర్వాతి చిత్రం ఎమర్జన్సీ. పీరియాడిక్ డ్రామాగా రానున్న ఈ సినిమాలో కంగనా ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ సినిమా భారతదేశపు మొదటి మహిళ ప్రధాని అయిన ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. ఈ సినిమాకు దర్శకత్వం కంగనానే వ్యవహరించడం విశేషం.












Click it and Unblock the Notifications