కొరటాల శివకు ఫోన్ చేసిన షారుక్ ఖాన్?
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తెలుగు దర్శకుడు కొరటాల శివకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే రూపుదిద్దుకోవడమేకాదు బాలీవుడ్ లో భారీ విజయాలను సాధిస్తున్నాయి.
ఒకరకంగా చెప్పాలంటే ఉత్తరాది ప్రేక్షకులు మొత్తం తెలుగు హీరోలను పిచ్చిపిచ్చిగా అభిమానిస్తున్నారు. యూట్యూబ్ లో కూడా వెదికి మరీ వారి సినిమాలను చూసేస్తున్నారు. తెలుగు స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే హిందీలో స్టార్ హీరోలుగా ఉన్న అజయ్ దేవ్ గణ్, అక్షయకుమార్, షారుక్ ఖాన్ లాంటివారు తమ సినిమాలను వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొంది.

దక్షిణాది దర్శకులు సిద్ధహస్తులు
దీంతో షారుక్ ఖాన్ దక్షిణాదికి చెందిన దర్శకులతో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అయింది. ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో దక్షిణాది దర్శకులది అందెవేసిన చేయి అని భావించిన షారుక్ తన తర్వాత సినిమాను ఎవరితో చేయాలా? అనే పరిశోధనలో ఉన్నారు. అయితే అందరూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దేవర చిత్రం మొదటి భాగాన్ని పూర్తిచేశారు. అది విజయ దశమికి విడుదల కాబోతోంది.
కథ కావాలంటే 4 నెలలు
ఈ నేపథ్యంలో కొరటాలతో సినిమాల చేయాలనే భావనతో బాద్ షా కొరటాలకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథా చర్చలు సిద్ధం కావాల్సి ఉంది. వాస్తవానికి కొరటాల దేవర తర్వాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు. అయితే షారుక్ లాంటి స్టార్ కొరటాలవైపు మొగ్గుచూపుతుండటంతో ఆయనకోసం కథను సిద్ధం చేయాలి.
కనీసం కథ సిద్ధం కావాలంటేనే మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. సామాజిక సందేశాలను కమర్షియల్ గా ముడిపెట్టి సినిమాను తీయడంలో కొరటాల సిద్ధహస్తుడు. అందుకే బాద్ షా ఈ డైరెక్టర్ ను ఎంపిక చేసుకున్నారు. జవాన్ లో కూడా సందేశాలిచ్చిన షారుక్ కొరటాల చిత్రంతో ఏ సందేశం ఇస్తాడోచూడాలి మరి.












Click it and Unblock the Notifications