'గేమ్ ఛేంజర్' ఫస్ట్ రివ్యూ ఇచ్చిన క్రిటిక్..టార్చర్ అంటూ ట్వీట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన, టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ట్రైలర్‌ను చూస్తుంటే సినిమాలో దర్శకుడు శంకర్ మార్క్ కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.శంకర్ గత సినిమాల మాదిరిగానే అన్యాయాలపై పోరాడే హీరోగా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే సినిమాపై తన ఫస్ట్ రివ్యూ ఇచ్చారు బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ నుండి మొదటి రివ్యూ పేరిట ఉమర్ సంధు తన రివ్యూ ఇచ్చాడు.

సినిమా బాలేదని ఉమర్ సంధు తేల్చేశాడు. శంకర్ , రామ్ చరణ్‌ల అత్యంత బలహీనమైన సినిమాగా 'గేమ్ ఛేంజర్' ఉందని ఉమర్ సంధు చెప్పుకొచ్చాడు.బోరింగ్ నరేషన్, కాలం చెల్లిన కథ, స్క్రీన్ ప్లే & డైలాగ్స్ అన్ని కూడా పేలవంగానే ఉన్నాయని ఈ బాలీవుడ్ క్రిటిక్ తెలిపాడు. నటీనటుల ప్రదర్శన కూడా అంతగా లేదని తెలిపారు. ఈ విషయంలో రామ్ చరణ్ నన్ను క్షమించాలని అతను కోరాడు. ఫైనల్‌గా సినిమా టార్చర్ అని తేల్చేశాడు. ఉమర్ సంధు ట్వీట్‌పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bollywood critic Umair Sandhu gave the first review of Game Changer

ఇలాంటి ట్వీట్స్ చేయడానికి సిగ్గుండాలని కొందరు అంటుంటే, అతనిపై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక 'గేమ్ ఛేంజర్' విషయానికి వస్తే..సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'గేమ్ ఛేంజర్' అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ గత చిత్రం 'ఆచార్య' ఫ్లాప్ కావడంతో , 'గేమ్ ఛేంజర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'గేమ్ ఛేంజర్' సినిమాతో రామ్ చరణ్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కూడా మార్చేస్తాడని మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.రామ్ చరణ్ కెరీర్‌లోనే 'గేమ్ ఛేంజర్' భారీ హిట్‌గా నిలపలనే ఉద్దేశంతో దర్శకుడు శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాను తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.జనవరి 10వ తేదీన 'గేమ్‌ ఛేంజర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తర్వాత 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ లెక్కలను ఎలా మారుస్తాడో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+