అల్లు అర్జున్ అరెస్ట్‌పై బాలీవుడ్ రియాక్షన్..తప్పే అంటున్న స్టార్ హీరో
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షోల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందిన కేసులో మెగా హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్‌పై 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని చెప్పింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. అల్లు అర్జున్‌తో తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అసలు ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారని ఎవరూ ఊహించలేదు. తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్‌పై బాలీవుడ్ సైతం స్పందించింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ స్పందించారు.

అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన అతను ,సేఫ్టీ ప్రోటోకాల్ విషయంలో విఫలమైతే హీరోపై వెయ్యడం సరికాదంటూ వరుణ్ ధావన్ రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications