సమంతను హీరోయిన్‌గా వద్దన్న స్టార్ హీరో...?
హీరోయిన్ సమంత క్రేజ్ తగ్గిపోయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆమెకు పెద్దగా సినిమా ఆఫర్లు రావడం లేదనేది అక్షర సత్యం. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఇటీవలే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్రల్ ఇస్తోంది. ''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు అల్లు అర్జున్, అట్లీ మూవీ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో కూడా హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి.
అయితే ఏమైందో తెలియదు కానీ ఈ సినిమా నుంచి అట్లీ తప్పుకున్నారు. అల్లు అర్జున్‌తో తీయాల్సిన సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో తెరకెక్కించడానికి అట్లీ ప్రయత్నాలు చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సరసన సమంత హీరోయిన్ అంటే బాలీవుడ్ జనాలకు పెద్దగా నచ్చకపోవచ్చు. దీంతో ఈ సినిమాలో మరో హీరోయిన్‌ను ఎంపిక చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరో బాలీవుడ్ ఆఫర్ కూడా సమంతకు చేయి జారినట్టు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ హీరోగా డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఓ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సమంతను తీసుకున్నారనే వార్తలొచ్చాయి.

ఈ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇదే నిజమైతే సమంత కెరీర్ బాలీవుడ్ లో పరుగులు పెట్టడం ఖాయం అని అనుకున్నారంతా. అయితే ఈ విషయంలో నిజం లేదని..ఇది కేవలం రూమర్ మాత్రమే అని తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా హీరోల నిర్ణయం వల్లే జరుగుతుంది అనేది టాక్. మొత్తానికి బాలీవుడ్ హీరోలు సమంతను దూరం పెడుతున్నారన్న ప్రచారం మాత్రం గట్టిగా జరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ కావాలని కలలు కన్న సమంతకు అక్కడి హీరోలు గట్టి షాక్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications