అనూహ్యం: తెలుగులో టాప్-5 హీరోయిన్లు వీరే!
ఏ రంగలో పనిచేస్తున్నా అందులో నెంబర్ వన్ స్థానం చేరేందుకే అందరూ ప్రయత్నిస్తుంటారు. అందులో సినిమా రంగంలో పనిచేసేవారైతే మరింత శ్రమిస్తుంటారు. అలా మొదటి స్థానానికి చేరుకుంటే వారికి దక్కే గౌరవం వేరుగా ఉంటుంది.. వచ్చే పారితోషికం కూడా అందరికంటే ఎక్కువగా ఉంటుంది. తాజాగా బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ జూన్ 2024 వరకు తెలుగులో టాప్ 10 హీరోయిన్లు ఎవరు అనే అంశంపై సర్వే చేసి ఫలితాలను వెల్లడించింది. ఆ ఫలితాల ప్రకారం మన తెలుగు హీరోయిన్లు ఎవరు, ఏ స్థానంలో నిలబడ్డారో తెలుసుకుందాం.
అనుపమకు ఏ స్థానమంటే
టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ టాప్ టెన్ లో 10వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం బిజీ బిజీగా మారుతోంది. ఒకప్పుడు టాప్ లో నిలిచిన పూజాహెగ్డే 9వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు. తమిళంలో సూర్యతో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవలి కాలంలో ఆమె గ్రాఫ్ శరవేగంగా పడిపోయింది. 20 సంవత్సరాల నుంచి పరిశ్రమలో రాణిస్తోన్న తమన్నా 8వ స్థానంలో నిలిచింది. స్టార్ హీరోయిన్ గా మారడానికి అష్టకష్టాలు పడుతున్న కీర్తి సురేష్ 7వ స్థానంలో నిలిచింది. ఇప్పుడే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

6వ స్థానంలో నేషనల్ క్రష్
నేషనల్ క్రష్ రష్మిక 6వ స్థానంలో నిలిచింది. అన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలే చేస్తున్నప్పటికీ ఆమెకు ఆరో స్థానమే దక్కింది. యంగ్ బ్యూటీ శ్రీలీలకు 5వ స్థానం దక్కింది. ఇటీవలి కాలంలో సినిమాలన్నీ పరాజయం పాలవడంతో ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. సహజమైన అందానికి చిరునామా అయిన సాయిపల్లవికి 4వ స్థానం దక్కింది. తండేల్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతోంది. అరుదుగా సినిమాలు చేస్తున్న అనుష్క 3వ స్థానంలో నిలవడం విశేషం. క్రిష్ దర్శకత్వంలో కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలో నటిస్తోంది. కాజల్ అగర్వాల్ 2వ స్థానంలో నిలిచింది. చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోయినప్పటికీ రెండో స్థానంలో నిలవడం గమనార్హం. చివరగా నెంబర్ వన్ స్థానంలో సమంత నిలిచింది. ఏడాదిన్నర నుంచి సినిమాలేమీ చేయనప్పటికీ టాప్1గా నిలవడం విశేషం. ఆమెకున్న క్రేజ్ చెక్కుచెదరలేదని నిరూపితమవుతోంది.












Click it and Unblock the Notifications