రజినీకాంత్ "జైలర్ 2" మూవీలో బాలీవుడ్ బాద్ షా..!
సూపర్ స్టార్ రజినీకాంత్.. కేవలం ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఆయనకు భాషతో సంబంధం లేకుండా రజినీకి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్, థాయ్ లాండ్, బ్యాంకాక్ సహా పలు దేశాల్లో సూపర్ స్టార్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో.. ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' మూవీలో రజినీ కాంత్ నటిస్తున్నారు. 2023లో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జైలర్' చిత్రం భారీ విజయాన్ని సాధించింది. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖ నటుల గెస్ట్ అప్పియరెన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ మూవీ. దాంతో వరుస ఫ్లాపులతో ఉన్న సూపర్ స్టార్ మళ్లీ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. దీంతో సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సీక్వెల్‌లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ పాత్రలతో పాటు మరో తెలుగు స్టార్ హీరో కూడా కీలక క్యామియో రోల్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పాత్రలో టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ నటించనున్నారన్న ప్రచారం సినీ వర్గాల్లో బాగా వినిపించింది. రజినీకి నందమూరి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం రీత్యా బాలయ్య క్యామియో ఫిక్స్ అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా నుంచి బాలయ్య తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో విజయ్ సేతుపతి నటిస్తున్నారు.
ఇక ఇప్పుడు ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నారట. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్.. గతంలో షారుక్ నటించిన రావన్ సినిమాలో రజినీకాంత్ స్పెషల్ క్యామియోలో కనిపించారు. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో షారుక్ కనిపించబోతున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కన్ఫమ్ చేశారు. మరోవైపు స్టార్ హీరోలు మరో హీరో సినిమాల్లో క్యామియో అప్పీరియన్స్ ఇవ్వడం నడుస్తోంది. జైలర్ 2 లో ఇదే స్ట్రాటజీతో వెళ్తున్నాడు నెల్సన్. జైలర్ 2పై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.












Click it and Unblock the Notifications