ర‌హ‌స్యంగా రెండో పెళ్లిచేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో..

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలియ‌ని సినీ ప్రేక్ష‌కులుండ‌రు. అద్భుతమైన నటనతో, డ్యాన్స్ తో ఎంతోమంది అభిమానుల‌కు చేరువ‌య్యాడు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటారు ఈస్టార్ హీరో... తాజాగా హృతిక్ రోష‌న్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. హృతిక్‌రోష‌న్ ర‌హ‌స్యంగా రెండో పెళ్లి చేసుకున్న‌ట్లు ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతేకాదు, ఈ విష‌యాన్ని స్వయంగా హృతిక్ రోష‌నే త‌న ఇన్‌స్టాలో పోస్టు చేయ‌డం ఒకింత ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సోషల్ మీడియాలోని త‌న ఖాతాలో "హ్యాపీ యానివర్సరీ పార్టనర్" అంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ పోస్టుతో పాటు ఒక అమ్మాయి ఫోటోని కూడా జత చేశారు. దీంతో ప్రియురాలు స‌బా ఆజాద్‌ను ఆయ‌న పెళ్లిచేసుకున్న‌ట్లు తెలుస్తోంది. హృతిక్‌రోష‌న్ సుస్సానే ఖాన్ నుంచి విడిపోయాక‌ సబా ఆజాద్‌కి దగ్గరయ్యారు. గ‌త కొన్నేళ్లుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఏ ఈవెంట్‌ జరిగినా వీరిద్ద‌రూ జంట‌గా క‌నిపించ‌డం చూస్తునే ఉన్నాం. దీంతో ఈ క్యూట్ క‌పుల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందంటూ బాలీవుడ్‌లో టాక్ వినిపించింది. కానీ వీరి పెళ్లిపై ఎలాంటి వార్త‌లు రాలేదు. అయితే తాజాగా హృతిక్ రోషన్‌ చేసిన పోస్ట్ ద్వారా వీరిద్ద‌రి పెళ్లి అయిపోయిన‌ట్లు తెలుస్తోంది.

Bollywood star hero who secretly got married for the second time

ఫ‌స్ట్ యానివ‌ర్సీరీ..

హృతిక్‌రోష‌న్ రీసెంట్‌గా సబా ఆజాద్‌తో దిగిన ఫోటోను త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ చూస్తుంటే తన ప్రియురాలినే హృతిక్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. హృతిక్ తాజా పోస్ట్‌తో గతేడాది అక్టోబర్‌లోనే వీరి పెళ్లి జరిగినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ జంట తమ ఫ‌స్ట్ యానివ‌ర్సీరీనీ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్‌ను బ‌ట్టి వీరిద్ద‌రూ ఎలాంటి హాడావిడి ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నట్లు అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+