బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌కి ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?
బాలీవుడ్ బాద్ షా.. కింగ్ ఖాన్ "షారుఖ్ ఖాన్"కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం హిందీలోనే కాకుండా సౌత్ లో కూడా ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. విదేశాల్లో సైతం షారుఖ్ మూవీకి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో అందరికి తెలిసిందే. ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు ఈ స్టార్ హీరో. 1992లో వచ్చిన 'దీవానా' అనే సినిమాతో కెరీర్ ను ప్రారంభించారు. 100కు పైగా చిత్రాలలో నటించిన ఆయన.. రీసెంట్ గానే పఠాన్, జవాన్ చిత్రాలతో భారీ హిట్స్ అందుకోగా.. డంకీ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.
కాగా నేడు తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు విషెస్ తెలియజేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ స్పెషల్ డే రోజు ఆయన మరో మైలురాయిని అధిగమించారు. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో చోటు దక్కించుకొని బిలియనీర్ల క్లబ్‌లో చేరారు. షారూఖ్ తో పాటు ఈ జాబితాలో వ్యాపారులతో పాటు క్రీడాకారులు, సినీ నటులు కూడా ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

షారూఖ్ రికార్డు..
ఈ జాబితా ప్రకారం రూ.12,490 కోట్ల నికర విలువతో (షారుఖ్ ఖాన్ నెట్‌వర్త్) తొలిసారిగా బిలియనీర్‌గా గుర్తింపు పొందారు. షారుఖ్ ఖాన్ తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని నటన ద్వారానే ఆర్జించినట్టు తెలుస్తోంది. నటనతో పాటు నిర్మాణ రంగంలో, ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కూడా ఆయన భారీగా ఆదాయం పొందుతున్నారు. ఆయన సంపద గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 71% పెరిగింది. మరోవైపు షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఆధ్వర్యంలో స్థాపించిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ కూడా ఆయన ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సంస్థ FY23లో రూ.85 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
షారుఖ్ అత్యధిక సంపద కలిగిన నటుడిగానే కాకుండా, అత్యధిక పన్నులు చెల్లించే నటులలో కూడా అగ్రస్థానంలో ఉన్నారు. గత ఏడాది ఫార్చ్యూన్ ఇండియా నివేదిక ప్రకారం, షారుఖ్ ఖాన్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.92 కోట్ల పన్నులు చెల్లించి, అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచారు.
-
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
రూ.10 కోట్లు బడ్జెట్.. 10 రోజుల్లోనే 160 కోట్లకు పైగా కలెక్షన్స్ !! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications